వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రాండ్ వెడ్డింగ్ చేసిన గుప్తా సోదరులకు భారీ జరిమానా విధించిన మున్సిపాలిటీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ : పెళ్లి పేరుతో ఊరు మొత్తాన్ని చెత్తమయం చేసినందుకు దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తలకు భారీ జరిమానా విధించింది జోషిమతీ మున్సిపాలిటీ. దక్షిణాఫ్రికాకు చెందిన అజయ్ మరియు అతుల్ గుప్తా అనే వ్యాపార వేత్తలు తమ కుమారుడి వివాహంను చాలా గ్రాండ్‌గా చేసింది. అయితే వివాహం కోసం వాడిన సామగ్రి అంతా అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడి జంతువులు ఆ ప్లాస్టిక్ సామగ్రిని తిని మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుప్తా సోదరులపై రూ.2.5 లక్షలు జరిమానా విధించారు.

రూ.2.5 లక్షల జరిమానాలో లక్ష రూపాయలు బహిరంగ విసర్జన చేసినందుకు మరో రూ.1.5 లక్షలు చెత్తను పడేసినందుకు విధించారు అధికారులు. దీనికి సంబంధించిన చలానా కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి పంపించింది. దీనికి తోడు వివాహం తర్వాత చెత్త చెదారం భారీగా మిగిలిపోవడంతో దాన్ని తీసుకెళ్లేందుకు రూ.8.14 లక్షల బిల్లును కూడా తయారు చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీ వద్ద రూ.5.54 లక్షలు గుప్తా సోదరులు డబ్బులు డిపాజిట్ చేశారు.ఇందులో రూ.54వేలు యూజర్ ఛార్జీల కింద చెల్లించింది.

Gupta brothersimposed heavy fine for scattering garbage

ఈ హైప్రొఫైల్ వివాహం తర్వాత జోషిమత్‌ మున్సిపాలిటీ దాదాపు 306 క్వింటాళ్ల చెత్తను సేకరించింది మున్సిపాలిటీ. ఈ చెత్తను తరలించేందుకు 3 నుంచి 4 ట్రక్కులు ప్రతిరోజు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి మొత్తం చెత్తను క్లీన్ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే గుప్తా సోదరులు చమోలీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వద్ద సెక్యూరిటీ కింద డిపాజిట్ చేసిన రూ. 3 కోట్లు రీఫండ్ పై జూలై 8న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు చెప్పనుంది. హై కోర్టు ఆదేశాల మేరకు ఈ గ్రాండ్ మ్యారేజ్‌ను 13 ప్రభుత్వ శాఖలు దగ్గరుండి వీడియోను తీశాయి.

English summary
A penalty of Rs 2.5 lakh has been slapped on the South Africa-based businessmen brothers Ajay and Atul Gupta for scattering garbage in Auli in Uttarakhand where the weddings of their sons were held last week, an official said on Saturday."We have imposed a fine of Rs 2.5 lakh on the Gupta brothers," said SP Nautiyal, Executive Officer of the Joshimath municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X