వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19కి చేరిన గురుదాస్‌పూర్ పేలుడు మృతుల సంఖ్య.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం

|
Google Oneindia TeluguNews

గురు‌దాస్‌పూర్ : సాయంత్రం 4 గంటలు .. నిశ్శబ్ద వాతావరణం ... ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అని చూసేలేపే పదుల సంఖ్యలో కార్మికులు విగతజీవులుగా పడి ఉన్నారు. మరికొందరు తీవ్రగాయాపడ్డారు. గాయపడ్డవారి హహకారాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ప్రమాద వార్త తెలిసి వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఎగిసిపడుతున్న మంటలనే ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

19 మంది మృతి

పటాకుల ఫ్యాక్టరీలో 19 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అసలే పటాకుల ఫ్యాక్టరీ మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. సమీపంలో ఉన్న మూడు, నాలుగు భవనాలు కూలిపోయాయి. ప్రమాద తీవ్రత ఒక్క కిలోమీటర్ వరకు ప్రభావం చూపింది. మంటలు ఎగిసిపడటంతో ఓ కారు, బైక్ కూడా ధ్వంసమైంది. పటాకుల భవనం మూడు అంతస్తులు కాగా .. ఆ భవనం మొత్తం నేలమట్టమైంది. భవనంలో ఉన్న వారు సహయం చేయాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకొని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ (ఎన్డీఆర్ఎఫ్), ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలంలో పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

<strong>బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...</strong> బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...

రాష్ట్రపతి సంతాపం

పటాకుల ఫ్యాక్టరీలో ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ స్పందించారు. పటాకుల ఫ్యాక్టరీలో ప్రమాదం దిగ్బాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బాధాకరమన్న ఉప రాష్ట్రపతి

ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.

షాక్‌నకు గురైన అమరీందర్ సింగ్

పటాకుల ఫ్యాక్టరీలో ప్రమాద విషయం తెలిసి షాక్‌నకు గురయ్యానని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదంపై గురుదాస్ పూర్ ఎంపీ సన్నీ డియోల్ కూడా స్పందించారు. బాటాలాలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

English summary
at least 19 people have died, 15 others are injured and many are feared trapped due to a blast which took place in a firecracker factory in Gurdaspur, Punjab on Wednesday. Fire tenders are present at the spot. President of India Ram Nath Kovind tweeted, "Saddened to learn about the loss of lives due to an explosion at a firecracker factory in Batala, Punjab. Condolences to bereaved families impacted by this tragedy and wishing an early recovery to those injured."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X