వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైవ్ స్టార్ అనుభవం, ఐ ఫోన్ గిఫ్ట్: అతనితో డేటింగ్‌కు 2000 మంది ఓకే

గుర్గావ్: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ప్రేమికుల దినోత్సవాన్ని అమ్మాయిలతో కలిసి జరుపుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

|
Google Oneindia TeluguNews

గుర్గావ్: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ప్రేమికుల దినోత్సవాన్ని అమ్మాయిలతో కలిసి జరుపుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫైవ్ స్టార్ ఎక్స్‌పీరియన్స్‌తో డేట్‌కు వచ్చే వారు రావాలని పేర్కొన్నాడు.

కొంచెం భిన్నంగా

కొంచెం భిన్నంగా

కొంచెం భిన్నంగా సోషల్ మీడియా ద్వారా అతను అమ్మాయిలను ప్రేమికుల దినోత్సవం రోజు రప్పించాలనుకున్నాడు. అతని పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 2000 మంది అమ్మాయిలు డేటింగ్‌కు సిద్ధమని చెప్పారు.

షకుల్ గుప్తా

షకుల్ గుప్తా

అలా పోస్ట్ పెట్టిన అతను షకుల్‌ గుప్తా అనే బిలియనీర్‌. ఒక గర్ల్‌ఫ్రెండ్‌తో కాకుండా అయిదుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ప్రేమికుల రోజుని జరుపుకోవాలనుకున్నాడు. ఇందుకు కోసం ఫేస్‌బుక్‌లో.. నా వ్యాలెంటైన్‌ ఎవరవుతారు? కింద ఇచ్చిన నా ప్రొఫైల్‌ చూడండి. మీకు నచ్చితే మెసేజ్‌ చేయండని ఓ పోస్ట్‌ చేశాడు.

రెండు వేల మంది రెడీ

రెండు వేల మంది రెడీ

ఆ పోస్ట్‌ చూసి ఏకంగా రెండువేల మందికి పైగా అమ్మాయిలు అతని ప్రొపోజల్‌ను అనుమతించారు. షకుల్‌ మాత్రం వారందరినీ కాకుండా అందులో బెస్ట్‌ అయిదుగురిని ఎంపిక చేశాడు. వారిని ఎంపిక చేయడంలో ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 14న జరుపుకోవాల్సిన వ్యాలెంటైన్స్‌ డేని 16న చేసుకున్నాడు.

అప్ సెట్ కావొద్దని..

అప్ సెట్ కావొద్దని..

వారిని గుడ్‌గావ్‌లోని ఒబెరాయ్‌ హోటల్‌లో డిన్నర్‌కి తీసుకెళ్లడమే కాకుండా ఆ అయిదుగురికీ ఐఫోన్‌7 కొనిచ్చాడు. వారితో కలిసి దిగిన ఫొటోలని, ఫోన్లకి, డిన్నర్‌కి అయిన బిల్లుని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. పైగా మిగతా అమ్మాయిలు అప్‌సెట్‌ కావద్దని 2018 వ్యాలెంటైన్స్ డేకి తనతో డేటింగ్‌కి వెళ్లే ఛాన్స్‌ గెలుచుకోండని చెప్పాడు.

English summary
Men have a variety of ways to woo girls and social media has made it easier with for many to simply make their wealth do the talking. A Delhi man did not require Tinder to get a date on Valentines Day, he simply posted a date request on Facebook and he got more than he could have expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X