దారుణం: దళిత యువతిని పెళ్లి చేసుకున్నందుకు కొట్టి చంపారు
గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే నెపంతో 28 ఏళ్ల యువకుడ్ని కొందరు దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
తన తమ్ముడు ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని, అప్పట్నుంచే అతనికి బెదిరింపులు వస్తున్నాయని బాధితుడి సోదరుడు తెలిపాడు.
కాగా, ఆదివారం తన సోదరుడి భార్య పుట్టింటికి వెళ్లగా, బాద్‌షాపూర్ గ్రామంలో ఉన్న తన సోదరుడ్ని కొందరు కర్రలతో కొట్టారని చెప్పారు.

కాగా, బాధితుడు ఆకాశ్ ఆటోలో ఇంటికి వస్తుండగా.. ఆ ఆటో నిందితుల్లో ఒకరైన అజయ్‌ను ఢీకొట్టింది. దీంతో అజయ్ తన స్నేహితులతో వచ్చి ఆకాశ్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత నిందితులు అకడ్నుంచి పరరాయ్యారు. ఐదుగురు నిందితులను ఈ కేసులు పోలీసులు అరెస్ట్ చేశారు.
గురువారం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా.. పోలీస్ కస్టడీ విధించింది.
గతంలో ఈ నిందితులు ఆకాశ్‌ను దళిత యువతిని పెళ్లి చేసుకున్నందుకు బెదిరించారు. ఆకాశ్ అగ్రవర్ణానికి చెందినవాడు కావడంతో ఆ వర్గంలోని కొందరు ఇతడిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.