వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..’: టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గుర్గావ్‌ : విద్యాబుద్ధులు నేర్పే గురువును గౌరవించాల్సిందిపోయి కొందరు విద్యార్థులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీస సభ్యతను మరిచిపోతున్నారు. అవారాలుగా మారి తిక్క చేష్టలకు పాల్పడుతున్నారు. క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఓ టీచర్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా ఓ 13 ఏళ్ల విద్యార్థి బెదిరించాడు.

చదవండి: ఛీ.. వీడు గురువేనా?: అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లతో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తూ...

టీచర్‌ను, ఆమె మైనర్‌ కూతురుని రేప్‌ చేస్తానంటూ సోషల్‌ మీడియా ద్వారా బెదిరించాడు. ఈ సంఘటన గుర్గావ్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే, ఆ స్కూల్లో ఇదే తొలి సంఘటన కాదు. అంతకు వారం రోజుల ముందు కూడా కొంతమంది విద్యార్థులు తమతో రైడింగ్‌కు వస్తారా? క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు వస్తారా? అంటూ కూడా మెయిల్స్‌ పంపించారు.

facebook

తాజాగా ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పంపిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూసి టీచర్‌ సహా కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ రోజు నుంచి ఆమె స్కూల్‌‌కు వెళ్లడమే మానేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం కూడా ఈ అంశాలపై సీరియస్‌గా స్పందించడం మొదలుపెట్టింది.

జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు, స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపించనున్నట్లు స్పష్టం చేసింది.

English summary
A 13-year-old student of an elite Gurgaon school, studying in class seven, threatened to rape one of his teachers and her minor daughter in a post on social media site Facebook rattling the institution's administration. Disturbingly, this is not the only incident of delinquent behaviour by a student that the upscale school faced. Another teen student emailed a teacher offering joyride, candlelight date and sex. Both incidents happened last week, sources said. The Facebook post has shocked the family of the teacher and her minor daughter, who is undergoing mental trauma and has not attended classes since the incident, they said. The victim is learnt to be the accused student's classmate, they added. Her equally agonised mother, however, has managed to rejoin the school, sources said. Taking note of the seriousness of the incidents, the district Child Welfare Committee has decided to issue a notice to the school and is mulling counselling sessions for the children as well as school authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X