వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ కేసులో రేపే తీర్పు: కోర్టుకు వస్తానన్న గుర్మీత్, ఉత్కంఠ

ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎట్టకేలకు న్యాయ విచారణను ఎదుర్కోవడానికి సిద్దపడ్డారు. తనపై ఉన్న అత్యాచార ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు తాను కోర్టు ఎదుట హాజరవుతానని తెలిపారు. గురువ

|
Google Oneindia TeluguNews

చంఢీగడ్: డేరా సచ్చా సౌధ చీఫ్, ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎట్టకేలకు న్యాయ విచారణను ఎదుర్కోవడానికి సిద్దపడ్డారు. తనపై ఉన్న అత్యాచార ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు తాను కోర్టు ఎదుట హాజరవుతానని తెలిపారు.

గురువారం నాడు కోర్టు ఎదుట హాజరవనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన భక్తులంతా శాంతి, సంయమనం పాటించాలని సూచించారు. నడుం నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. చట్టాల మీద ఉన్న గౌరవం, దేవుడిపై విశ్వాసంతో తాను న్యాయస్థానం ఎదుట హాజరవుతానని అన్నారు.

gurmeet ram rahim appeals for peace ahead of rape case verdict

కాగా, తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. 15ఏళ్ల క్రితం నాటి ఈ రేప్ కేసులో పంచకుల సీబీఐ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో పంజాబ్, హర్యానాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

శాంతిభద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ సమగ్ర నివేదిక అందించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. జాట్ల ఆందోళన సందర్బంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా కేంద్ర పాలిత చండీగఢ్ లో 72గం. పాటు మొబైల్, ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Massive security arrangements have been put in place in Chandigarh and Panchkula as largescale violence feared by followers of Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim who will be appearing in court on Friday for hearing in a rape case against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X