వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తితో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నం: డేరా బాబా అనుచరుడిగా గుర్తింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంటు వద్ద సోమవారం ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాంచాడు. అయితే, సెక్యూరిటీ గార్డ్స్ అతడ్ని పట్టుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆ ఆగంతకుడు విజయ్ చౌక్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించబోయాడు.

కుల్ భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్: పాక్ ఆఫర్‌ను అంగీకరించిన భారత్, నేడే భేటీకుల్ భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్: పాక్ ఆఫర్‌ను అంగీకరించిన భారత్, నేడే భేటీ

అయితే, సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద కత్తి దొరికింది. సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ దుండగుడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు? కత్తితో పార్లమెంటులోకి ఎందుకు ప్రవేశించాడనే విషయాలు పోలీసులు విచారణలో బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలేమీ నడవడం లేదు.

Gurmeet Ram Rahim follower caught trying to enter Parliament with a knife

దుండగుడు బ్లాక్ షర్ట్, జీన్స్ వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. దుండగుడ్ని సాగర్ ఇన్సాగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇతడు డేరా సచ్చా సౌదా చీఫ్, అత్యాచార నిందితుడు రామ్ రహీద్ సింగ్ అలియాస్ డేరా బాబా అనుచరుడని, లక్ష్మీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఓ కారు పార్లమెంటు ఆవరణలో కలకలం రేపింది. 2001లో ఉగ్రవాదులు చొరబడిన ద్వారం గుండా ఓ కారు దూసుకొచ్చింది. అప్రమత్తమైన అధికారాలు స్పైక్స్ యాక్టివేట్ చేయడంతో కారు బంపర్ దెబ్బతిని అక్కడే ఆగిపోయింది.

అయితే, ఆ కారు మణిపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత డాక్టర్ థోక్సోమ్‌కు చెందినదని తెలిసింది. ఆ సమయంలో సదరు ఎంపీ ఆ కారులో లేరు. అనుమతి లేని ద్వారం గుండా కారు దూసుకురావడంతో కొంత అలజడి నెలకొంది.

English summary
The Parliament security personnel witnessed some tense moments when a man, allegedly carrying a knife, tried to enter the premises on Monday morning, news agency ANI reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X