వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాబాబా: రూ.1,495 కోట్ల ఆస్తులు, 504 బ్యాంకు ఖాతాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: డేరా బాబా రామ్ రహీమ్ సింగ్‌కు రూ.74.96 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్టు హర్యానా ప్రభుత్వం గుర్తించింది. వేర్వేరు బ్యాంకులకు చెందిన పొదుపు, టెర్మ్ డిపాజిట్ ఖాతాల్లో ఈ సొమ్ము ఉందని విచారణ అధికారులు ప్రకటించారు.

డేరాబాబా: జైలులో ప్రతిరోజూ రూ.20 వేతనండేరాబాబా: జైలులో ప్రతిరోజూ రూ.20 వేతనం

డేరాబాబాకు పలు బ్యాంకుల్లో వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాలున్నట్టుగా విచారణ అధికారులు గుర్తించారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ళ పాటు జైలు శిక్షను విధించారు.

డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?

డేరాబాబా రామ్ రహీమ్ సింగ్ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అనేక దారుణాలకు ఆశ్రమంలో పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. డేరా సచ్ఛా సౌధలో బాబా అనేక అకృత్యాలకు పాల్పడినట్టుగా విచారణ అధికారులు గుర్తించారు.

డేరా బాబా: భక్తుల కోసం డ్రింక్, కానీ...47 నియమాలు తప్పనిసరిడేరా బాబా: భక్తుల కోసం డ్రింక్, కానీ...47 నియమాలు తప్పనిసరి

డేరా సచ్చా సౌధలో రామ్ రహీమ్ సింగ్ సాధ్వీలు, విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని విచారణలో తేలింది. ఈ విషయమై డేరా సచ్ఛా సౌధలో పనిచేసిన కొందరు మాజీ ఉద్యోగులు ఈ విషయమై విచారణ అధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

డేరాబాబాకు రూ. 74.96 కోట్ల ఆస్తులు

డేరాబాబాకు రూ. 74.96 కోట్ల ఆస్తులు


డేరా బాబా రామ్ రహీం సింగ్‌కు చెందిన డేరా సచ్చా సౌదాకు రూ.74.96 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు హర్యానా ప్రభుత్వం నిర్థారించింది. వీటిలో రామ్ రహీం వ్యక్తిగత ఖాతాలు 12 ఉన్నట్లు, ఆయన పేరు మీద రూ.7.72 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ పేరు మీద 6 బ్యాంకు ఖాతాల్లో రూ. 1 కోటికిపైగా ఉందని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

504 బ్యాంకు ఖాతాలు

504 బ్యాంకు ఖాతాలు


డేరాలోని వివిధ సంస్థలకు మొత్తం 504 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. వీటిలో 473 ఖాతాలు పొదుపు, టెర్మ్ డిపాజిట్ ఖాతాలు కాగా, మిగిలినవి రుణాలకు సంబంధించినవి ఉన్నాయని తేలిందని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. డేరాబాబా నేతృత్వంలోని ఫిలిం ప్రోడక్షన్ యూనిట్ హకీకత్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరు మీద 20 ఖాతాల్లో సుమారు రూ.50 కోట్లు ఉన్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది.

కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వివరాలు సేకరణ

కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వివరాలు సేకరణ



ఆగష్టు 25వ, తేదిన రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అయితే ఈ కేసు తర్వాత చెలరేగిన హింసపై కోర్టు సీరియస్ అయింది. నష్టాన్ని డేరా బాబా నుండి రికవరీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం డేరాబాబా ఆస్తుల వివరాలను సేకరించింది. రామ్ రహీం, ఆయన కుమార్తెలు అమర్‌ప్రీత్, చరణ్‌ప్రీత్, కుమారుడు జస్మీత్, కోడలు, అల్లుళ్ళు, హనీప్రీత్, డేరా సచ్చా సౌదా ట్రస్ట్, దాని అనుబంధ సంస్థల పేరు మీద ఉన్నట్లు గుర్తించింది. ఈ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం స్తంభింపజేసింది

సిర్సాలో రూ.1,435 కోట్ల ఆస్తులు

సిర్సాలో రూ.1,435 కోట్ల ఆస్తులు


హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని డేరా ఆస్తుల వివరాలను సేకరించింది. సిర్సా జిల్లాలో రూ.1,435 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 504 బ్యాంకు ఖాతాల్లో 495 ఖాతాలు సిర్సా జిల్లాలోనే ఉన్నట్లు తెలుసుకుంది. వీటిలో చాలా ఖాతాలు ఫిక్స్‌డ్ డిపాజిట్, క్యుములేటివ్ డిపాజిట్ ఖాతాలు అని తేల్చింది.

English summary
The Haryana government has compiled a list of bank accounts opened in the name of the Dera Sacha Sauda and its affiliated bodies.The list includes 504 accounts – including 473 savings and term deposits accounts and the remaining loan accounts. A total of Rs 74.96 crore are held in savings and term deposits accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X