వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జర్నలిస్ట్ హత్య కేసు: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ముగ్గురికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచకుల ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ హత్య కేసులోని మరో ముగ్గురు నిందితులకు కూడా న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించింది.
2002లో జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి దారుణ హత్యకు గురయ్యారు. డేరాబాబా అక్రమాలపై ఆయన తన పత్రికలో వరుస కథనాలు ఇచ్చారు. పూర్ సచ్చా పేరుతో అతను కథనాలు ఇచ్చారు. దీంతో ఆయనపై కక్ష కట్టి హత్య చేశారు. హర్యానాలోని సిర్సా పట్టణంలో ఈ హత్య జరిగింది.

మహిళలపై అత్యాచారం కేసులో డేరాబాబా ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు కోర్టు శిక్షను ఖరారు చేయడానికి ముందే హర్యానా వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.