వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను వదిలేయండి: గుర్మెహర్ కౌర్, ధైర్యశాలివంటూ రాబర్ట్ వాద్రా సపోర్ట్

విశ్వవిద్యాలయాల్లో హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీ నుంచి, ఏబీవీపీ వ్యతిరేక ప్రచారం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లు ఢిల్లీ విద్యార్థిని.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీ నుంచి, ఏబీవీపీ వ్యతిరేక ప్రచారం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లు ఢిల్లీ విద్యార్థిని, కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌ కౌర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజీలో అల్లర్ల నేపథ్యంలో 'బెదిరింపులు వస్తున్నాయి.. నేను ఏబీవీపీకి భయపడను' అని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్‌ బాగా వైరల్‌ అయింది. తనను అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని గుర్మెహర్‌ సోమవారం ఢిల్లీ మహిళా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు భద్రత కూడా కల్పించారు. అయితే తాను నిరసన ర్యాలీలో పాల్గొనడం లేదని మంగళవారం ట్వీట్‌ చేశారు.

కానీ 'ఢిల్లీ యూనివర్సిటీని కాపాడండి' అనే నినాదంతో నిర్వహిస్తున్న ర్యాలీలో అందరూ పాల్గొనాలని గుర్మెహర్‌ కోరారు.'ఈ ప్రచారం నుంచి నేను తప్పుకుంటున్నాను.. అందరికీ శుభాకాంక్షలు. నన్ను ఇక ఒంటరిగా వదిలేయమని అభ్యర్థిస్తున్నా. నేను ఇప్పుడు చెప్పాల్సి ఉందో అదే చెప్పాను' అని గుర్మెహర్‌ ట్వీట్‌ చేశారు.

ఈ ప్రచారం నా కోసం కాదు, విద్యార్థుల కోసం.. దయచేసి ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి అని కోరారు గుర్మెహర్. 'నా ధైర్యం, సాహసం గురించి ప్రశ్నించే వారికి చెప్తున్నా.. నేను కావాల్సిన దాని కంటే ఎక్కువ ధైర్యమే చూపించాను' అని గుర్మెహర్‌ పేర్కొన్నారు.

రాబర్ట్ వాద్రా మద్దతు

కాగా, గుర్మెహర్ కౌర్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మద్దతు పలికారు. నియంతృత్వ దోరణులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న నీకు మా అందరి మద్దతు ఉంటుందని చెప్పారు. నిన్ను చూసి దేశం గర్విస్తోందంటూ ఆయన చెప్పుకొచ్చారు. వాక్ స్వాతంత్ర్య మన హక్కు అని ఆయన చెప్పారు.

English summary
A day after the Delhi University turned into a battlefield, Gurmehar Kaur, who received a lot of criticism for her views against the ABVP, on Tuesday tweeted and said that she had withdrawn from the 'Save DU campaign.' Kaur's friend said that she (Gurmehar) was scared and was leaving Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X