వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతం ఇవ్వలేదని ఏకంగా బస్సుతోనే ఉడాయించిన ఘనుడు

|
Google Oneindia TeluguNews

గురుగ్రాం: జీతం ఇవ్వడం రెండు రోజులు ఆలస్యం అవడంతో ఓ ప్రెవేట్ స్కూలుకు చెందిన బస్సు డ్రైవర్ ఏకంగా బస్సుతోనే ఉడాయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రాంలో చోటుచేసుకుంది. బస్సుడ్రైవర్‌ సతీష్‌ను పోలీసులు సోమవారం అసెస్టు చేసి అతని వద్ద నుంచి బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూలు అయ్యాక విద్యార్థులను బస్సులో డ్రాప్ చేసేందుకు వెళ్లిన సతీష్ ఇక బస్సుతో పాటే అటే వెళ్లిపోయాడని... స్కూలు క్యాంపస్‌కు తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. సతీష్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అతని సహచరుడు ఫోన్ చేయగా... జీతం ఇవ్వనందుకు తాను బస్సును ఎత్తుకొచ్చేశానని సమాధానం చెప్పాడు.

ధూమ్ 2 తరహాలో.. నిజాం మ్యూజియంలో భారీ చోరీధూమ్ 2 తరహాలో.. నిజాం మ్యూజియంలో భారీ చోరీ

స్కూలు తర్వాత సతీష్ బస్సును నడుపుకుంటూ తన ఇంటికి వెళ్లాడని..స్కూలు పార్కింగ్‌లో బస్సుసు పార్క్ చేయలేదని స్కూలు ట్రాన్స్ పోర్టు మేనేజర్ తెలిపాడు. అయితే ఎంతకీ రాకపోవడంతో సతీష్‌కు ఫోన్ చేయగా రెండు రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినందుకు బస్సును తీసుకొచ్చేశానని చెప్పినట్లు మేనేజర్ తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్ 406 కింది పోలీసులు కేసు నమోదు చేశారు. హర్యానా రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న బస్సును అతని నివాసం దగ్గర పార్క్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Gurugram driver runs away with school bus, as his salary was delayed

కేవలం జీతం ఆలస్యంగా ఇవ్వడంతోనే సతీష్ ఈ పనికి పాల్పడ్డాడని చెప్పిన పోలీసులు అతన్ని సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే బస్సు దొరకడంతో సమస్య పరిష్కారమైందని స్కూలు ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ చెప్పారు.

English summary
Annoyed by a two-day delay in the disbursement of his salary, the bus driver of a private sports academy in Sector 49 took off with the institution’s bus on Friday. The accused, identified by his first name Satish, was arrested on Monday and the bus recovered from him, after a complaint was lodged in this regard by the academy’s transport manager, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X