వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించి పెళ్లి.. సంసార జీవితంలో టార్చర్..! ఇతరులపై లైంగిక కేసలు పెట్టాలని వేధింపు!! చివరకు..

|
Google Oneindia TeluguNews

గురుగ్రామ్ : చూపులు కలిశాయి, మాటలు ఒక్కటై మనస్సులు కలిశాయి. ఇంకేముంది పెళ్లైంది. తర్వాత ప్రబుద్ధుడి కపటబుద్ధి బయటపడింది. ఆ వివాహితకు వేధింపులు అంటే ఎంటో తెలిసేలా ప్రవర్తించాడు. అసహజరీతిలో సెక్స్ కోసం టార్చర్, భౌతికంగా దాడులు.. తర్వాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయాలని ఒత్తిడి చేశాడు.

వేధింపుల పర్వం ..

వేధింపుల పర్వం ..

రాజస్థాన్‌‌లోని అల్వార్‌కు చెందిన మహిళ గురుగ్రామ్‌లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న ఆమెకు ఓ సైకో పరిచయమయ్యాడు. అతడు యునానీ క్లినిక్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 2016లో అజార్ ఖాన్‌తో మాటలు కలిశాయి. తర్వాత స్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లయిందే అప్పడు అజార్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. అప్పటినుంచి వివాహితకు టార్చర్ అంటే ఏమిటో చూపించాడు. డబ్బుల కోసం వేధింపులు తీవ్రరూపం దాల్చాయి.

రోజూ టార్చర్ ...

రోజూ టార్చర్ ...

ప్రతీరోజు మానసికంగా హింసించేవాడు. టార్చర్ పీక్‌కి చేరి కొట్టడం మొదలెట్టాడు. ప్రతీ చిన్న విషయానికి గొడవపడేవాడు. తర్వాత మతం మార్చుకోవాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో .. తన శాడిజాన్ని చూపించాడు. దీంతోపాటు పడకగదిలో అసహజరీతిలో సెక్స్ కోసం వేధించేవాడని వివాహిత వాపోయింది. తర్వాత డబ్బుల కోసం వ్యుహం రచించాడని తెలిపింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని అసత్య కథనాలు అల్లమని పురిగోల్పి .. బ్లాక్ మెయిల్ చేయించేవాడని వివరించింది. ఇన్నాళ్లు అజార్ చేసిన అరాచకాలను మంగళవారం పోలీసులకు వివరించింది. అయితే వీరిలో ఓ జడ్జి కూడా ఉండటం విశేషం. జడ్జి తనపై లైంగికదాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విచారణ చేయడంతో .. భార్యభర్తల బండారం బయటపడింది. తర్వాత తనను భర్తే .. బ్లాక్ మెయిల్ చేయాలని పురిగోల్పాడని ఆమె వాపోయింది. జడ్జిపై చేసిన ఆరోపణలు అవాస్తవని విచారణ చేసిన పోలీసులు తెలిపారు.

ఈజీ మనీ కోసం ....

ఈజీ మనీ కోసం ....

2018లో ఓ కేసులో జైలుకెళ్లొచ్చిన అజార్ ..ఈజీ మనీ కోసం తన భార్యను ఉపయోగించాడు. ఇతరులపై లైంగికదాడులు చేశారని ఆరోపిస్తూ డబ్బులు గుంజడం ప్రారంభించారు. కానీ వీరు డబ్బులు వసూల్ చేసిన ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారం మాత్రం దొరకలేదు. మే 1న రేవారిలో ఓ మహిళ తనను 8 మంది లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత నగదు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పడంతో ... లైంగికదాడికి సంబంధించిన కేసును పోల్చిచూశారు పోలీసులు. అంతేకాదు జూన్ 29న కూడా మనేసార్‌లో మరో నలుగురు రేప్ చేశారని ఫిర్యాదు రావడంతో ... ఆ వివాహిత ఆటకట్టించారు పోలీసులు

English summary
A resident of Alwar in Rajasthan, the woman told police that she met the suspect, identified as Hzar Khan, in 2016 while she was working in a private hospital in Nuh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X