• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిడ్డ నోరు నొక్కేసి.. 4 గంటల పాటు నన్ను..: కన్నీరుమున్నీరైన బాధితురాలు

By Ramesh Babu
|

గురుగ్రామ్: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్ లో ఇటీవల మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 నెలల వయసున్న చిన్నారి నోరు నొక్కిపెట్టి.. ఆమె తల్లిపై ఇద్దరు కామాంధులు నాలుగు గంటల పాటు సామూహిక అత్యాచారం జరిపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

చదవండి: బూతుబొమ్మలు పంపి వేధించిన ఆకతాయికి చుక్కలు చూపించిన గృహిణి

తన తొమ్మిది నెలల పాపతో ఆ మహిళ(23) వెళుతుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు... ముగ్గురు నిందితుల్లో యోగేంద్ర, అమిత్ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మూడో నిందితుడైన టెంపో డ్రైవర్‌ పరారీలో ఉండగా, అతని కోసం గాలిస్తున్నారు.

Gurugram: Painful incident, gangraped woman travels several hours in metro carrying dead body of 9 month baby

ఈ కేసులో బాధితురాలు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆమె కథనం ప్రకారం... అత్యాచారం జరిగిన రోజు అర్థరాత్రి సమయంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లడానికి తన 9 నెలల పాపతో ఆమె బయటికి వెళ్లింది. తొలుత ఒక ట్రక్కు ఎక్కగా, ఆ ట్రక్కు డ్రైవర్‌ ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఉన్నపళాన ఎనిమిదో నంబరు జాతీయ రహదారిపై వదిలివేసి వెళ్లిపోయాడు.

అంతలో ఒక టెంపో ఆటో ఆమె వద్దకు వచ్చి ఆగింది. అందులో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. అప్పటికే పీకలదాక తాగేసి ఉన్న వారు ఆమెపై దాడి చేశారు. ఆ పెనుగులాటలో ఆమె కూతురు పెద్దగా ఏడ్వడంతో ఆ దుర్మార్గులు.. బలవంతంగా పాప నోరు నొక్కిపెట్టారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆగ్రహంతో ఆ చిన్నారిని వారు విసిరి బయటికి పారేశారు.

వారి దౌర్జన్యకాండకు విలవిలలాడిన ఆమె తనను వదిలేయమంటూ వారి కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుంది. అయినా కామంతో కళ్లుమూసుకుపోయిన వారికి ఆమె వేడికోలు కనిపించలేదు. అక్కడ రోడ్డు మీదే కదులుతున్న ఆటోలో 4 గంటలపాటు ఆమెపై వారు అత్యాచారం చేశారు.

ఆ దుర్మార్గులు వెళ్లిపోయాక ఆమె ఓపిక తెచ్చుకుని.. లేచి తిరిగి తన కూతురిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతదూరం వెళ్లాక అక్కడ రోడ్డు మీద ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్న పాపను చూసిన ఆమె వెంటనే భుజాన వేసుకుని గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే పాప చనిపోయినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమె షాక్ తింది. ఆ రోజు తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆమె విలపిస్తూ చెబుతుంటే పోలీసులకే కళ్లలో నీళ్లు తిరిగాయి.

English summary
An awful incident was came into vision from Gurugram when the lady was gangraped inside the auto and her 9 month daughter was killed by the rapists. The victim woman was travelling for several hours in the metro carrying dead body of her nine-month old daughter. On Monday the victim told the whole incident to the Gurugram police. On May 29, according to the police in Gururgram, a woman living in Bihar was going to her house with her nine month baby daughter. On the way an auto driver seated him in his auto on the pretext of giving a lift. Some people were sitting in auto. The men started molestating the woman by which baby girl started crying. Seeing those miscreants threw the baby out of the auto, which led to her death. After this, the miscreants raped girl's mother in auto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X