వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కుప్పకూలిన ఫ్లై‌ ఓవర్ - భారీ వర్షమే కారణమట - కేసు కూడా లేదు - ఇద్దరు ఎస్కేప్

|
Google Oneindia TeluguNews

వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఇద్దరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణం భారీ వర్షాలేనని నిర్మాణ సంస్థ చెబుతుండగా, స్థానికులు మాత్రం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ శివారులో గల గురుగ్రామ్ లో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

హర్యానాలోని గురుగ్రామ్‌ సిటీలో రాజీవ్ చౌక్ నుంచి సాహ్నా వరకు (6 కిలోమీటర్ల మేర) కొత్తగా ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ లోని ఓ భాగం శనివారం రాత్రి కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వాళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు.

అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..

Gurugram: Part of an under-construction flyover collapses, 2 injured

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) బృందం, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (ఎస్‌డీఎం), సివిల్ డిఫెన్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) ప్రశాంత్ పన్వర్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కాగా, ఈ ప్రమాదంపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతుననారు.

దారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందనదారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందన

Gurugram: Part of an under-construction flyover collapses, 2 injured

Recommended Video

Locusts Swarm : Delhi, Gurgaon కు చేరిన Locusts Swarm || Oneindia Telugu

సుమారు రూ.2వేల కోట్లతో నిర్మిస్తోన్న ఈ ఫ్లై ఓవర్ ప్రాజెక్టును ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేప‌ట్టింది. గడిచిన కొద్ది రోజులుగా గురుగ్రామ్ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు కుంగిపోవడం వల్లే ఫ్లైఓవ‌ర్‌ లోని కొంత భాగం కూలిపోయింద‌ని కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే స్థానికులు మాత్రం ఫ్లైఓవ‌ర్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని, అందుకే కూలి ఉంటుదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు కాకపోవడంతో అనుమానాలు ఇంకా రెట్టింపయ్యాయి.

English summary
Asection of an under-construction flyover collapsed on Saturday evening at Sohna Road in Haryana's Gurugram. An elevated flyover is being constructed from Subhash Chowk to Bhondsi. A large slab of the flyover fell on the road. Two persons were injured when the huge concrete slab of the under-construction flyover fell on Sohna road. The injured, said to be labourers, were hospitalised immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X