• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?

|

గురుగ్రామ్ : కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు వేసే జరిమానాలతో వాహనదారులు జంకుతున్నారు. టూవీలర్ యాజమానికి వేసిన ఫైన్‌తో జరిమానాల పరంపరం పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు భారీ ఫైన్ వేసి .. తమ జులుం ప్రదర్శించారు ట్రాఫిక్ పోలీసులు. అంతమొత్తంలో ఫైన్ చూసి ట్రాక్టర్ డ్రైవర్ గుండె గుబేల్ మంది. వామ్మో ఇదేం జరిమానారా నాయనా అంటూ నిట్టూర్చారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లో ట్రాఫిక్ నిబంధనల పేరుతో ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్ వేస్తున్నారు.

బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...

వామ్మో .. ఫైన్

వామ్మో .. ఫైన్

గురుగ్రామ్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిబంధనలకు అతిక్రమించాడు. దానికి సంబంధించి న్యూ కాలనీలో ట్రాక్టర్‌ రూల్స్ అతిక్రమణను పోలీసులు చూశారు. అయితే అతను వెళ్తుంటే పట్టుకోవడం వేరు .. సీసీటీవీ ఫుటేజీలో చూసి మరీ జరిమానా వేశారు. అతనికి వేసిన జరిమానా చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయిపోయింది. రూ.59 వేల ఫైన్ విధించారు. ఇందుకు కారణాలు కూడా తెలిపారు. ఆ డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే ట్రాక్టర్ తిప్పుతున్నారని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా బయటకు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.

ఫైన్‌కు కారణాలివీ..

ఫైన్‌కు కారణాలివీ..

దీంతోపాటు ఎయిర్ పొల్యూషన్ టెస్ట్ చేయించలేదని, అందులో హనికర పదార్థాలు తీసుకెళ్తున్నారని చెప్పారు. భయంకరమైన డ్రైవింగ్ చేస్తున్నారని .. పోలీసు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిబంధనలను పాటించడం లేదని .. దీంతోపాటు చివరగా ట్రాక్టర్ లైట్ పసుపుపచ్చగా ఉందని పేర్కొంటూ రూ.59 వేల జరిమానా విధించారు. కొత్త మోటారు వాహన చట్టం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

నిన్న ఆటోకు

నిన్న ఆటోకు

ఇదే కాదు నిన్న ఆటో రిక్షా యజమానికి ఫైన్ వేశారు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముస్తాకిల్ పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చారు. గత 15 ఏళ్ల నుంచి గురుగ్రామ్‌లో ఉంటున్నారు. నిన్న సికందర్‌పూర్ వద్ద గల సెక్టార్ 26 రహదారిపై రెడ్‌లైట్ పడింది. రెడ్ లైట్ పడిన ఆటో రిక్షాను యధేచ్చగా వెళ్లాడు. దీంతో నిబంధనలను అతిక్రమించారని భావించి ఫైన్ వేశారు. ఆటోను నిలిపి .. పేపర్లు చూపించాలని కోరారు. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడం చూసి ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. ఆటో రిక్షాకు సంబంధించిన డాక్యుమెంట్లను డీఎల్ఎఫ్ ఫేజ్-3 వద్ద వదిలేశానని అతని చెప్పారు. తనకు 10 నిమిషాల సమయం ఇస్తే ఆర్సీ, సీ బుక్ తీసుకొస్తానని చెప్పారు. వారిని అర్థించిన ప్రయోజనం లేకపోయింది. ఆటో యజమాని మాటను ట్రాఫిక్ పోలీసులు లెక్కచేయలేదు.

English summary
tractor-trolley driver in Haryana's Gurugram was fined a whopping Rs 59,000 for flouting several traffic norms. The fine amount was calculated according to the newly amended Motor Vehicles Act. The amendments have significantly increased fines for various traffic offences with the aim of making Indian roads safer. The Gurugram tractor-trolley driver's case is the latest in a series of similar incidents in which drivers have been heavily fined for flouting traffic norms. The Gurugram tractor-trolley driver was caught near New Colony in Harayana's Gurugram. He was charged with a litany of traffic offences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X