వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోం అల్లర్ల ఎఫెక్ట్... గుహవటి పోలీస్ కమీషనర్‌ బదిలీ

|
Google Oneindia TeluguNews

అసోంలో శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసు వ్యవస్థ విఫలం కావడంతో ఆ రాష్ట్రంలోని గుహవాటి పోలీస్ కమీషనర్‌పై వేటు పడింది. ప్రజల ఆందోళనలను అదుపు చేయలేని ప్రస్తుత పోలీస్ కమీషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి నూతన కమీషనర్‌గా మున్నా ప్రసాద్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్టాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా త్రిపుర , అసోం రాష్ట్రాల్లో బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రజలు, నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అందోళనలను అడ్డకునేందుకు కర్ఫ్యూ సైతం విధించారు. అయినా ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

 Guwahati police chief removed

ముఖ్యంగా అల్‌ అసోం స్టూడెంట్స్ ఇచ్చిన పిలుపుతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున నగర రోడ్లపైకి వచ్చారు. ఈనేపథ్యంలోనే రాజధాని నగరంలో ఉన్న సీఎం ఇంటిపై కూడ అందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లను ధ్వసం చేసిన పరిస్థితి కనిపించింది.

ఏకంగా సీఎం తోపాటు అధికార పార్టీ నేతలను ప్రజలు టార్గెట్ చేయడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటీ పరిణామాలు జరిగాయనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీస్ కమీషనర్‌ను తప్పిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

English summary
Officials said Guwahati Police Commissioner Deepak Kumar has been removed, and that a new chief, Munna Prasad Gupta, has been appointed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X