• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్ :మాజీ ప్రేయసిని దక్కించుకొనేందుకు అతనేం చేశాడంటే ?

By Narsimha
|

న్యూఢిల్లీ :చదువుకొనే సమయంలో ఇద్దరూ ప్రేమించుకొన్నారు. కాని, పెళ్ళిచేసుకోలేకపోయారు. ఆ ప్రేమికులు ఇద్దరూ వేర్వేరుగా పెళ్ళిళ్ళు చేసుకొన్నారు.కాని, సంతోషంగా కాపురం చేయలేకపోయారు. దీంతో మాజీ ప్రేయసిని దక్కించుకొనేందుకు ఓ ప్రియుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రియురాలి భర్తను చంపాక, ప్రియుడు పోలీసులకు చిక్కాడు. తమ చేతులకు మట్టి అంటకుండా ఈ పథకాన్ని అమలుచేశారు. కాని చివరకు పోలీసులకు చిక్కక తప్పలేదు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకంది.

డిల్లీకి చెందిన అనీష్ యాదవ్ జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. ఆయన చదువుకొనే సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడ ఇతణ్ణి గాఢంగా ప్రేమించింది. అయితే వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోలేదు. కాని, ఇద్దరికి ఒకరంటే మరోకరికి ఇంకా ప్రేమ ఉంది. తాము వివాహం చేసుకొన్న వారితో సంతోషంగా ఉండడంలేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ప్రేమికులు ఇద్దరూ ఒక్కటి కావాలనుకొన్నారు. ఈ ఎలాగోలా భార్యను వదిలించుకోవడంతో పాటు ప్రియురాలి భర్తను కూడ వదిలించుకోవాలని భావించాడు ప్రియుడు అనీష్ యాదవ్. ఈ మేరకు ఏం చేస్తే తనకు ఇబ్బందులు రావనే విషయమై ఆలోచించాడు.

gym trainer plan to murder ex lover husband

గొడుగు హత్యలను ఎంచుకొన్నాడు

ఏ రకంగా హత్యలు చేస్తే తనకు ఇబ్బందులు తలెత్తవని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడు. 1978 నాటి కాలంలో లండన్ లో చోటుచేసుకొన్న గొడుగు హత్యలను ఆయన ఎంచుకొన్నాడు. ఫ్రోఫెషనల్ కిల్లర్ ను గొడుగు హత్య కోసం ఎంచుకొన్నాడు అనీష్ యాదవ్.ఈ మేరకు తన ప్రియురాలు భర్త రవికుమార్ ను చంపాలని ఆయన ప్రోఫెషనల్ కిల్లర్ కు చెప్పాడు.

ఢిల్లీ సదర్ బజార్ లో నివసించే రవికుమార్ కోటక్ మహీంద్రా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అనీష్ యాదవ్ ప్రియురాలిని వివాహం చేసుకొన్నాడు. శనివారం నాడు రవికుమార్ సినిమాకు వెళ్ళాడు. అయితే సినిమా థియేటర్ లో రవికుమార్ వెనుకే అనీష్ యాదవ్ ఎంచుకొన్న ఫ్రోఫెషనల్ కిల్లర్ కూర్చొన్నాడు.

రవికుమార్ మెడపై ఏదో గుచ్చుకొన్నట్టుగా అన్పించగానే ఆయన తన మెడపై చేయి పెట్టుకొని చూశాడు. అప్పటికే ఆయన మెడపై రక్తం కారుతోంది.ఇదే స్థితిలో రవికుమార్ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. సినిమాథియేటర్ లో ఉన్న జనం వెంటనే అతణ్ణి పట్టుకొన్నారు.

రవికుమార్ ను స్థానికలు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విఫపు ఇంజెక్షన్ ను రవికుమార్ కు ఇచ్చాడు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫ్రోఫెషనల్ కిల్లర్ ప్రేమ్ కుమార్ ను పోలీసులు విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది.

భార్యను వదిలేసి ప్రియురాలి భర్త హత్యకు కుట్ర

ప్రియురాలిని దక్కించుకొనేందుకుగాను భార్యను అనీష్ యాదవ్ ఇటీవలే వదిలేశారు. మరో వైపు ప్రియురాలి భర్తనుహత్య చేయించడం ద్వారా ప్రియురాలిని దక్కించుకోవచ్చని భావించాడు. ఈ మేరకు ఫ్రోఫెషనల్ కిల్లర్ ప్రేమ్ తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ప్రేమ్ కుమార్ పోలీసులకు చిక్కడంతో అసలు విషయం బయటపడింది.ప్రేమ్ కుమార్ కు అనీష్ యాదవ్ సుమారు 1.5 లక్షలను చెల్లించి ఈ హత్య చేయించాడు.

ఈ హత్యతో రవికుమార్ భార్యకు కూడ సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పటికే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. అయితే కేసు విచారణ కోసం ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
anish yadav working as a gym trainer in delhi, he plan to murder his former lover hussand ravikurmar, ravikumar murderd by poison injection on saturday night, police arrest anish yadav,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more