వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఏ పరీక్షలకు దీపా కర్మాకర్ రెడీ, ఆ తర్వాత 2020 టోక్యోపై దృష్టి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్యం కోల్పోయి, నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మహిళా జిమ్నాస్ట్ ఇప్పుడు పరీక్షలతో బిజీగా ఉన్నారు. త్రిపుర యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో వచ్చే వారం నుంచి పీజీ పరీక్షలు జరగనున్నాయి. దీపా కర్మాకర్ ఎంఏ చదువుతోంది.

దీపా కర్మాకర్ వచ్చే వారం నుంచి జరగనున్న పరీక్షల కోసం సిద్ధమవుతుందని ఆమె తండ్రి శుక్రవారం నాడు చెప్పారు. శనివారం నాడు ఉదయం దీపా తన కోచ్‌తో కలిసి ఢిల్లీకి రానుందని, సోమవారం నాడు తన కూతురు అగర్తాలకు చేరుకుంటుందని చెప్పారు. ఇక, తన పరీక్షల పైన దృష్టి సారిస్తుందన్నారు.

Gymnast Dipa Karmakar will get busy with MA examination

అగర్తాలకు వచ్చిన తర్వాత ఎంఏ పరీక్షల కోసం సిద్ధమవుతుందన్నారు. ఆమె ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతోందన్నారు. దీపా కర్మాకర్ దూర విద్య ద్వారా చదువుతోందన్నారు. ఎంఏ పరీక్షల అనంతరం దీపా కర్మాకర్ ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతుందని తండ్రి (దులాల్) చెప్పారు.

English summary
Gymnast Dipa Karmakar, who finished fourth in the Olympics final at Rio, will take her MA examination next week under Tripura University, her father said here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X