వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: ఇండియన్ టెక్కీలకు తలుపులు తెరిచిన రష్యా, కారణమిదే!

హెచ్ 1 బీ వీసా కఠినతరమైన నిబంధనలను అమలు చేయడంతో భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్లా తెరిచింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన నిబంధనలతో రష్యా భారత్ టెక్కీలకు అవకాశం కల్పించనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హెచ్ 1 బీ వీసా కఠినతరమైన నిబంధనలను అమలు చేయడంతో భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్లా తెరిచింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన నిబంధనలతో రష్యా భారత్ టెక్కీలకు అవకాశం కల్పించనుంది.

అమెరికా అద్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా టెక్కీలకు ఇబ్బందికల్గించేలా నిర్ణయాలు తీసుకొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ట్రంప్ హమీ ఇచ్చారు.ఈ మేరకు హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చాడుఈ ఆర్డర్ తో ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులు మొదలయ్యాయి.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల కారణంగా రష్యా ఇండియన్ టెక్కీల కోసం తలుపులు బార్లా తెరిచింది. ఈ మేరకు ఇండియన్ టెక్కీల కోసం అవకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించింది.

ఇండియన్ టెక్కీల కోసం తలుపులు తెరిచాం

ఇండియన్ టెక్కీల కోసం తలుపులు తెరిచాం

ప్రపంచంలోని కొన్ని దేశాలు భారతీయ వీసా హెల్డర్స్ కు షాకిస్తుంటే రష్యా బంపర్ ఆఫర్ ను ఇస్తున్నట్టు ప్రకటించింది. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినం చేయడంతో భారత ఐటీ పరిశ్రమకు రష్యా తలుపులు తెరిచి ఉంచిందని ఆ దేశ మంత్రి చెప్పారు.సాఫ్ట్ వేర్ రంగంలో ఇండియాతో తమ దేశం సహాకారాన్ని కోరుకొంటుందని రష్యన్ మంత్రి చెప్పారు. దేశీయ ఐటీ ఇండస్ట్రీతో నాస్కామ్ తో కూడ రష్యన్ టెలికం మాస్ కమ్యూనికేషన్ డిప్యూటీ మంత్రి రషీద్ ఇష్కైలవ్ చర్చలు జరిపారు.

భారత టెక్కీలకు ఇతర దేశాల ఆహ్వానం

భారత టెక్కీలకు ఇతర దేశాల ఆహ్వానం

అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాల నుండి భారత టెక్కీలకు ఆహ్వానాలు అందుతున్నాయి. కెనడా, రష్యా దేశాల నుండి భారత్ టెక్కీలకు ఆహ్వానాలు వస్తున్నాయి.తమ దేశాల్లో టెక్నాలజీ అవసరాలరీత్యా ఆయా దేశాలు ఇండియాకు చెందిన టెక్కీలకు ఆహ్వానాలను పంపుతోంది.అమెరికా తెస్తోన్న నిబంధనలు తమకు ప్రయోజనంగా మారుతున్నాయని భారత టెక్కీలు అభిప్రాయంతో ఉన్నారు.

జూన్ లో రష్యాలో ఎకనమిక్ ఫోరమ్ సమావేశం

జూన్ లో రష్యాలో ఎకనమిక్ ఫోరమ్ సమావేశం

ఈ ఏడాది జూన్ 1వ,తేది నుండి మూడవ తేది వరకు రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇండియా గెస్ట్ కంట్రీ. ఇండియా, రష్యా దేశాల మధ్య సాప్ట్ వేర్ రంగాల్లో మరింత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకుగాను ఈ సదస్సు ఉపయోగపడుతోందని నిపుణులు భావిస్తున్నారు.

రష్యాలో జరిగే సమావేశానికి హాజరుకానున్న మోడీ

రష్యాలో జరిగే సమావేశానికి హాజరుకానున్న మోడీ

జూన్ లో మూడు రోజుల పాటు జరిగే సమావేశంలో ఇండియా ప్రధానమంత్రి మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని నాస్కామ్ వర్గాలు తెలిపాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా బారత్ తో సహాకారాన్ని కోరుకోవడం కలిసిరానుందని నాస్కామ్ అభిప్రాయపడుతోంది. భారత్ వరల్డ్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుండగా, రష్యా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ , ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ , రోజోటిక్స్ లో ఎక్కువగా పురోగతిని సాధిస్తోంది.

English summary
The proposed US H-1B visa restrictions may open a door for India's IT industry in Russia with the two sides exploring cooperation in both software and hardware sectors during the visit of a Russian minister here last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X