బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రంప్ ప్రమాణ స్వీకారం: మాజీ ఐపీఎస్ కు ఆహ్వానం, ఎవరంటే ?

|
Google Oneindia TeluguNews

: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేసే కార్యక్రమానికి హాజరుకావాలని బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం మాజీ ఎంపీ (కాంగ్రెస్), రిటైడ్ ఐపీఎస్ అధికారి హెచ్.టి. సాంగ్లియానాకు వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది.

ఫిబ్రవరి 2,3 తేదీలలో అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని వైట్ హౌస్ నుంచి ప్రత్యేక ఆహ్వాన పత్రిక హెచ్.టి. సాంగ్లీయానాకు పంపించారు. ఆహ్వాన పత్రికతో పాటు విమాన టికెట్లు సైతం పంపారు.

 H T Sangliyana invited to meet Donald Trump

ఈనెల 30వ తేదిన హెచ్.టి. సాంగ్లియానా అమెరికా బయలుదేరి వెలుతారు. ఫిబ్రవరి 7వ తేదిన ఆయన భారత్ తిరిగి వచ్చేందుకు విమాన టిక్కెట్లు పంపారు. ప్రపంచంలోని 140 దేశాలకు చెందిన ప్రతినిధులకు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వాన పత్రికలు పంపించామని వైట్ హౌస్ అధికారులు సందేశంలో తెలిపారు.

కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా హెచ్.టీ. సాంగ్లియానాకు మంచి గుర్తింపు ఉంది. ఆయన శక్తి వంచన లేకుండా విధులు నిర్వహించారు. రౌడీల భరతం పట్టి సింహస్వప్నం అయ్యారు. సాంగ్లియానా పేరుతో, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా కన్నడలో అనేక సినిమాలు తీశారు. బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసిన సాంగ్లియానా ఓ సారి ఎంపీ అయ్యారు.

English summary
It is an honour to have been invited. I wish the very best for Trump, the new president of the United States. This is not for the oath taking ceremony but a prayer breakfast. I thank the senators for inviting me to the event, said Sangliana confirming the invitation he had recieved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X