వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమెరికా ఆఫర్‌కి నో, నెహ్రూ సరేనంటే చిక్కు తప్పేది'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వానికి భారత్ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, గతంలో చైనా కంటే ముందే భారత్‌కు అణు పరీక్షలకు సహకరిస్తామని అమెరికా ముందుకు వచ్చిందని, కానీ నెహ్రూ ఓకే చెప్పలేదని చెబుతున్నారు.

ఆ రోజే నెహ్రూ సరేనని అంటే మనకు ఇన్ని తిప్పలు తప్పేవని అంటున్నారు. చైనా కంటే ముందే అవకాశం వచ్చినప్పటికీ, దానిని నాటి ప్రధాని నెహ్రూ అవసరం లేదనుకున్నారని చెబుతున్నారు. అమెరికా స్వయంగా సహకరిస్తామని చెప్పినా వద్దన్నారని అంటున్నారు.. విదేశాంగ మాజీ కారదర్శి మహారాజాకృష్ణ రసగోత్ర.

రసగోత్రతాజాగా రాసిన 'ఏ లైఫ్‌ ఇన్‌ డిప్లొమసీ' పుస్తకావిష్కరణలో మాట్లాడారు. అమెరికా నాటి అధ్యక్షుడు జాన్‌ ఎఫ్ కెన్నడీకి భారత్‌ అంటే సాటి ప్రజాస్వామ్య దేశంగా ప్రత్యేక అభిమానం ఉండేదని, కమ్యూనిస్టు దేశమైన చైనా కంటే ప్రజాస్వామ్య దేశమైన భారత్‌.. ఆసియాలో మొట్టమొదటి అణుదేశంగా ఆవిర్భవించాలని భావించారని చెప్పారు.

Had Nehru accepted US offer, India will not have to try for NSG membership: Rasgotra

అణుపరీక్షలు జరపడానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొంటూ కెన్నడీ స్వయంగా రాసిన లేఖను అమెరికా అణుశక్తి కమిషన్‌ ఛైర్మన్‌కు ఇచ్చి భారత్‌కు పంపారన్నారు.

రాజస్థాన్‌లోని ఎడారిలో అణుపరీక్షలు జరపడానికి మా శాస్త్రవేత్తలు భారత్ శాస్త్రవేత్తలకు తగిన శిక్షణ ఇస్తారనీ భరోసా ఇచ్చారని చెప్పారు. అప్పుడే నెహ్రూ అంగీకరించి ఉంటే 1964లో చైనా కంటే ముందే మనం అణు దేశంగా ఆవిర్భవించి ఉండేదన్నారు. ఫలితంగా 1962లో చైనా, 1965లో పాక్‌ యుద్ధాలు తప్పి ఉండేవని అభిప్రాయపడ్డారు.

English summary
India need not have had to make desperate efforts now to get membership of the elite Nuclear Suppliers Group (NSG) had Prime Minister Jawaharlal Nehru accepted then U.S. President John F. Kennedy’s offer of helping the country detonate a nuclear device much before China did in 1964, according to former Foreign Secretary Maharajakrishna Rasgotra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X