బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రైం రిపోర్టర్ హత్యకు రూ. 30 లక్షలు కిరాయి, హాయ్ బెంగళూరు ఎడిటర్ అరెస్టు, భార్య !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీనియర్ రిపోర్టర్ ను హత్య చెయ్యడానికి రూ. 30 లక్షలు షార్ప్ షూటర్ కు కిరాయి ఇచ్చారని ఆరోపిస్తూ హాయ్ బెంగళూరు పత్రిక ఎడిటర్ రవి బెళగెరెని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శుక్రవారం మద్యాహ్నం హాయ్ బెంగళూరు పత్రిక ఎడిటర్ రవి బెళగెరెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

అదే పత్రికలో ఉద్యోగి !

అదే పత్రికలో ఉద్యోగి !

బెంగళూరు సీనియర్ క్రైం రిపోర్టర్ సునీల్ హెగ్గరహళ్ళి 17 ఏళ్ల నుంచి రవి బెళగెరెకి చెందిన హాయ్ బెంగళూరు పత్రికలో ఉద్యోగం చేశారు. తరువాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మూడు సంవత్సరాల క్రితం క్రైం రిపోర్టర్ సునీల్ హాయ్ బెంగళూరు పత్రికలో ఉద్యోగం నిలిపివేశాడు.

గౌరీ లంకేష్ హత్య కేసులో ?

గౌరీ లంకేష్ హత్య కేసులో ?

లంకేష్ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక విభాగం పోలీసులు (ఎస్ఐటీ) ఇటీవల తాహీర్ హుస్సేన్ అనే షార్ప్ షూటర్ ను అరెస్టు చేసి అతని నుంచి స్వదేశంలో తయారు చేసిన రివాల్వర్, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

 మరో షార్ప్ షూటర్ లింక్ !

మరో షార్ప్ షూటర్ లింక్ !

షార్ప్ షూటర్ తాహీర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారంతో విజయపురకు చెందిన మరో షార్ప్ షూటర్ శశిధర్ అలియాస్ శశి అనే వ్యక్తిని ఎస్ఐటీ అధికారులు అరెస్టు చేసి రివాల్వర్, బుల్లెట్లు, డబుల్ బ్యారల్ గన్ స్వాధీనం చేసుకున్నారు.

రూ. 30 లక్షలు కిరాయి

రూ. 30 లక్షలు కిరాయి

ఎస్ ఐటీ అధికారుల విచారణలో హాయ్ బెంగళూరు పత్రిక ఎడిటర్ రవి బెళగెరే క్రైం రిపోర్టర్ సునీల్ ను హత్య చెయ్యడానికి రూ. 30 లక్షలు కిరాయి ఇచ్చారని షార్ప్ షూటర్ శశిధర్ అంగీకరించారని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

 బెంగళూరులో !

బెంగళూరులో !

శుక్రవారం మద్యాహ్నం బెంగళూరులోని పద్మనాభ నగర్ లోని హాయ్ బెంగళూరు పత్రిక కార్యాలయంలోనే రవి బెళగెరెని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

శాసన సభ తీర్మాణం

శాసన సభ తీర్మాణం

ప్రభుత్వానికి, మంత్రులు, శాసన సభ్యులకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కర్ణాటక శాసన సభ రవి బెళగెరెని అరెస్టు చెయ్యాలని ఆదేశించింది. చివరికి కోర్టు జోక్యంతో రవి బెళగెరె అరెస్టు నుంచి తప్పించుకున్నారు.

 భార్య మీద కన్నేశాడు, టైం బాగుంది !

భార్య మీద కన్నేశాడు, టైం బాగుంది !

నా రెండో భర్య మీద కన్ను వేసినందుకు తాను సునీల్ ను చంపించాలని అనుకున్నాని, అయితే వాడి టైం బాగుంది, నాటైం బాగలేదని విచారణలో రవి బెళగెరె అంగీకరించారని కన్నడ టీవీ చానల్స్ ప్రసారం చేశాయి. ప్రముఖ కన్నడ హీరో శ్రీనగర్ కిట్టి రవి బెళగెరె కుమార్తె అయిన జర్నలిస్టును వివాహం చేసుకున్నారు.

English summary
Kannada tabloid 'Hai Bangalore' Editor Ravi Belagere arrested in Bengaluru by CCB sleuths for allegedly giving Supari to Sharp Shooters to Kill journalist Sunil, ex-employee of Hai Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X