వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ఇంటెలిజెన్స్ సంస్థకు మన రహస్యాలు లీక్..ఇంటిదొంగను అరెస్టు చేసిన ఏటీఎస్..!

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత ఒకటి ఉంది. కానీ మన ఇంటి దొంగను మాత్రం ఈశ్వరుడు పట్టుకోలేదు.. యాంటీ టెరరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్) పట్టుకుంది. అసలు విషయానికొస్తే... భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారంను శతృదేశం పాకిస్తాన్‌కు చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఉద్యోగిని యాంటీ టెరరిజం స్క్వాడ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఈ కథ ఏమిటో చూద్దాం...

మహారాష్ట్ర యాంటి టెర్రరిజం స్క్వాడ్ అధికారులు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగిని అరెస్టు చేశారు. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించి రహస్య సమాచారంను పాకిస్తాన్‌ ఐఎస్‌ఐకు చేరవేస్తున్నడన్న పక్కా సమాచారం అందడంతో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తిని దీప్ శ్రీసత్‌గా గుర్తించారు. ఇండియన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌కు సంబంధించి తయారీ విధానం, మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ సమాచారంను పాకిస్తాన్ గూఢచర్య సంస్త ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించిన ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సమాచారం మొత్తాన్ని వాట్సాప్‌ మరియు ఇతర సోషల్ మీడియా పై చేరవేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. అంతేకాదు ఈ వ్యక్తి గత కొంత కాలంగా ఐఎస్‌ఐతో సంబంధాలు నడుపుతున్నారని ఏటీఎస్ డీసీపీ వినయ్ రాథోడ్ చెప్పారు.

HAL Employee arrested by ATS for sharing confidential info to Paks ISI


నాశిక్‌కు సమీపంలో ఉన్న ఓజార్‌లోని హాల్ మ్యానుఫాక్చురింగ్ యూనిట్ వివరాలు, ఎయిర్‌బేస్, ఆ యూనిట్‌లో నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారంను కూడా పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు డీసీపీ విపయ్ రాథోడ్ చెప్పారు. హాల్‌లో అసిస్టెంట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల దీపక్‌పై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసింది ఏటీఎస్. ఇక దీపక్ వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నాశిక్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓజార్‌లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్ ఉంది. 1964లో ఏర్పాటైన ఈ సంస్థ, మిగ్ -21 ఎఫ్ ఎల్ ఎయిర్‌క్రాఫ్ట్, కే-13 క్షిపణులు, తయారు చేసేందుకు లైసెన్స్‌ కలిగి ఉండటంతో పాటు ఇప్పటి వరకు ఇతర మిగ్ వేరియంట్లు అంటే మిగ్-21ఎం, మిగ్-21 బిఐఎస్, మిగ్-27 ఎం లాంటి యుద్ధ విమానాలు తయారు అయ్యాయి. అంతేకాదు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఎంకేఐ ఫైటర్ జెట్‌ కూడా ఇక్కడే తయారు కావడం విశేషం. ఇక మిగ్ శ్రేణిలో ఉన్న ఫైటర్ జెట్ల మరమత్తులు ఇక్కడే జరుగడమే కాకుండా ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు కూడా మరమత్తులు ఈ డివిజన్‌లోనే జరుగుతున్నాయి.

Recommended Video

#IndoChinastandoff : HAL Light Combat Helicopters Deployed In Ladakh || Oneindia Telugu

English summary
The Maharashtra Anti-Terrorism Squad today arrested an employee of the Hindustan Aeronautics Limited (HAL) for allegedly supplying secret information of fighter aircraft to Pakistan's Inter-Services Intelligence (ISI) agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X