వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ విమానాల వివరాలు పాక్ ఐఎస్ఐకి చేరవేత: హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు చెందిన ఓ ఉద్యోగిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. యుద్ధ విమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.

ఐఎస్ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడన్న పక్కా సమాచారంతో ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) నాసిక్‌ విభాగం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దేశీయ యుద్ధ విమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సదరు ఉద్యోగి పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు అధికారులు తేల్చారు.

 HAL Employee Arrested For Supplying Fighter Jet Details To Pakistans ISI

నాసిక్ సమీపంలో ఓజార్ ప్రాంతంలో ఉన్న హెచ్ఏఎల్ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేసినట్లు గుర్తించారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమోరీ కార్డులు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చగా 10 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.

కాగా, నాసిక్‌కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్-21ఎఫ్ఎల్, మిగ్-21ఎం, మిగ్-21బీఐఎస్, మిగ్-27ఎం వంటి యుద్ధ విమానాలతోపాటు, కె-13 మిసైల్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. భారత రక్షణ రంగంలో ఎంతో కీలకంగా ఉన్న ఈ సంస్థకు సంబంధించిన సమాచారం నిందితుడు చేరవేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
The Maharashtra Anti-Terrorism Squad today arrested an employee of the Hindustan Aeronautics Limited (HAL) for allegedly supplying secret information of fighter aircraft to Pakistan's Inter-Services Intelligence (ISI) agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X