వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ విమానాలను హాల్ తయారు చేయగలదు..ఫైళ్లను కేంద్రం బహిర్గతం చేయాలి: హాల్ మాజీ ఎండీ సువర్ణరాజు

|
Google Oneindia TeluguNews

యుద్ధవిమానాలు తయారు చేస్తున్న దేశీయ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిటిటెడ్ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయగలదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ మాజీ ఛైర్మెన్ మాజీ ఎండీ సువర్ణరాజు. రాఫెల్ ఒప్పందంపై రాజకీయంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో సువర్ణరాజు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రెంచి సంస్థ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసికొని ఉంటే రాఫెల్ యుద్ధ విమానం తయారు చేయడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 1న పదవీవిరమణ చేసిన సువర్ణరాజు.... కేంద్ర ప్రభుత్వం రాఫెల్‌కు సంబంధించిన ఫైళ్లను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రశ్నించారు.

సుఖోయ్ తయారు అవుతున్నప్పుడు రాఫెల్‌ను ఎందుకు తయారు చేయలేం..?

సుఖోయ్ తయారు అవుతున్నప్పుడు రాఫెల్‌ను ఎందుకు తయారు చేయలేం..?

"హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఎయిర్‌ఫోర్స్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న 25 టన్నుల సుఖోయ్ -30 విమానం తయారు చేస్తున్నప్పుడు.. రాఫెల్ యుద్ధ విమానం ఎందుకు తయారు చేయలేము..? కేంద్రం ఒప్పందం చేసుకుని ఉంటే కచ్చితంగా రాఫెల్ యుద్ధ విమానం తయారు చేసేవాళ్లం. అయితే అనుకున్నంత కచ్చితమైన ధరలో తయారు అయ్యేది కాదేమో"అని సువర్ణ రాజు అన్నారు. ఫ్రెంచి సంస్థ డసాల్ట్‌తో హాల్ పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పిన రాజు... ఫైళ్లు బహిర్గతం చేస్తే మొత్తం విషయాలు తేటతెల్లం అవుతాయన్నారు. తాను విమానాలను తయారు చేస్తే అందుకు గ్యారెంటీ ఇవ్వగలననే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు సువర్ణ రాజు.

రాఫెల్ డీల్ ‌కంటే ముందు రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందానికి నో చెప్పిన రష్యారాఫెల్ డీల్ ‌కంటే ముందు రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందానికి నో చెప్పిన రష్యా

 ఫ్రెంచి కంపెనీల 100 గంటల్లో 100 విమానాలు తయారు చేయకపోవచ్చు కానీ...

ఫ్రెంచి కంపెనీల 100 గంటల్లో 100 విమానాలు తయారు చేయకపోవచ్చు కానీ...

డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేసిన మిరాజ్-2000 యుద్ధ విమానంను హాల్ గత 20 ఏళ్లుగా మెయింటెయిన్ చేస్తూ వస్తోందని అంతేకాక ఎప్పటికప్పుడు క్లిష్టమైన ప్రోగ్రామ్స్‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చిందని సువర్ణరాజు గుర్తు చేశారు. అలాంటప్పుడు రాఫెల్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించారు. తాను ఐదేళ్ల పాటు నాయకత్వం వహించినట్లు చెప్పిన సువర్ణరాజు ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వెల్లడించారు. ఇక ధరల విషయమై మాట్లాడిన సువర్ణరాజు... ఒక యుద్ధవిమానం ఎంతవరుకు పనిచేస్తుందో అంతవరకు అయ్యే ఖర్చును చూడాలి కానీ కేవలం ఒక యుద్ధవిమనాం కొనుగోలు గురించి చూడకూడదన్నారు. అంతేకాదు యుద్దవిమానం తయారు చేయడం కూడా నేర్చుకోవాలన్నారు. ఫ్రెంచి కంపెనీ 100 జెట్ విమానాలను 100 గంటల్లో చేయగలిగితే... కొత్తగా తయారు చేస్తున్న తమకు 200 గంటల సమయం తీసుకుంటుందని చెప్పారు. అంతే తప్ప 80 గంటల్లో తయారు చేయమంటే అది అసాధ్యం అన్నారు సువర్ణరాజు.

నిర్మలా సీతారామన్ మరోసారి అబద్ధం ఆడినట్లు రుజువైంది: రాహుల్ గాంధీ

నిర్మలా సీతారామన్ మరోసారి అబద్ధం ఆడినట్లు రుజువైంది: రాహుల్ గాంధీ

ఇదిలా ఉంటే సువర్ణరాజు చెప్పిన విషయాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాఫెల్ మినిస్టర్‌ అని సంబోధించిన రాహుల్ గాంధీ నిర్మలాసీతారామన్ అవినీతికి మద్దుతు ఇస్తున్నారని తాను అబద్ధం చెబుతున్నట్లు రాజు మాటలతో మరోసారి తేటతెల్లం అయ్యిందని ట్వీట్ చేశారు. హాల్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే కెపాసిటీ లేదన్న మంత్రి మాటలు మరోసారి అబద్ధం అని తేలాయి. తను ఆ పదవికి సరికారన్న రాహుల్ గాంధీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బుధవారం రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతి అవకతవకలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌కు నివేదిక సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. విచారణ జరిపి యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో అసలు నిజాలను వెలిక్కి తీయాలని కాంగ్రెస్ కాగ్‌ను కోరింది.

English summary
The former chairperson and managing director of Hindustan Aeronautics Limited, T Suvarna Raju, on Wednesday claimed the state-run plane manufacturer could have built Rafale jets in India if the government had signed a work-share contract with French firm Dassault Aviation.Raju, who retired on September 1, asked why the Union government was not releasing the files.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X