బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన హెచ్ఏఎల్ ఉద్యోగులు, ప్లాన్ రివర్స్, రాఫెల్ డీల్ దెబ్బ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు చివరి నిమిషంలో రివర్స్ అయ్యాయి. రాహుల్ గాంధీతో భేటీ కావడానికి హెచ్ఏఎల్ ఉద్యోగుల సంఘం నిరాకరించింది.

ఏఐసీసీ అధ్యక్షుడు ఒక్కరోజు బెంగళూరు పర్యటన ఖరారైయ్యింది. శనివారం బెంగళూరులో హెచ్ఏఎల్ ఉద్యోగులుతో రాహుల్ గాంధీ భేటీ అవుతారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేశాయి. కేంద్ర ప్రభ్వుత్వం రాఫెల్ డీల్ కుంభకోణంలో కుమ్మక్కు అయ్యిందని ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు.

 HAL issued a veiled threat to its employees not to meet AICC president Rahul Gandhi

బెంగళూరులో శనివారం కబ్బన్ పార్క్ లో హెచ్ఏఎల్ రిటైడ్ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులతో రాహుల్ గాంధీ చర్చాగోష్టి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చాగోష్టి కార్యక్రమంలో పాల్గొనకూడదని హెచ్ఏఎల్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు షాక్ కు గురైనారు. సాంకేతికపరంగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన హెచ్ఏఎల్ ఓ రాజకీయ ప్రముఖుడితో చర్చాగోష్టిలో పాల్గొంటే విమర్శలు ఎదురౌతాయని ఆ సంస్థ ఉద్యోగులు నిర్ణయించారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం కేపీసీసీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాదయాత్రతో కబ్బన్ పార్క్ లో జరిగే సమావేశానికి హాజరు కావలసి ఉంది. చివరి నిమిషంలో అది రద్దు అయ్యింది. అయితే శనివారం మద్యాహ్నం 3.30 గంటల సమయంలో రాహుల్ గాంధీ కబ్బన్ పార్క్ లో రాఫెల్ డీల్ కుంభకోణంసై తీవ్రస్థాయిలో చర్చ జరపనున్నారు.

English summary
Hindustan Aeronautics Ltd (HAL) issued a veiled threat to it's employees not to meet AICC president Rahul Gandhi on October 13, 2018 in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X