వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శెభాష్ హెచ్ఏఎల్ : డోర్నియర్ 228 విమానం ఇక యూరప్‌లో కూడా...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : విదేశీ వస్తువులు వద్దు .. స్వదేశీ వస్తువులే ముద్దు అని మేకిన్ ఇండియాలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ డోర్నియర్ 228 అనే రవాణా విమానాన్ని రూపొందించింది. దీనిని హెచ్ఏఎల్ సిబ్బంది రూపొందించగా .. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ ఆమోదం పొందింది. సరుకు రవాణా ప్రాంతీయ విమానానికి డీజీసీఏ ఆమోద ముద్రపడింది.

మేకిన్ ఇండియాలో భాగంగా హెచ్ఏఎల్ సిబ్బంది డోర్నియర్ విమానాన్ని రూపొందించారు. దీనికి ఇప్పటికే డీజీసీఏ ఆమోదంగా ..తాజాగా యూరొపియన్ యూనియన్ ఏవియేషన్ సేప్టీ ఏజెన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీజీసీఏ సర్టిఫికేట్‌ను పరిశీలించి ఆమోదం తెలుపుతున్నట్టు యూరొపియన్ ఏవియేషన్ విభాగం ప్రకటించింది. డోర్నియర్ తేలికపాటి విమానాలను దేశంలో వాడుతుండగా ... యూరప్‌లో రవాణా విమానాలుగా కూడా వాడనున్నారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టుకు ఇది పెద్ద అచివ్‌మెంట్ అని హెచ్ఏఎల్ అధికారులు చెప్తున్నారు.

HAL-made Dornier 228 aircraft can now be used in Europe

మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందించిన డోర్నియర్ విమానం యూరప్‌లో కూడా ఉపయోగించడంపై హర్షం వ్యక్తం చేశారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. వాణిజ్య విభాగాల్లో డోర్నియర్ విమానాలను వాడుతామని తమకు సమాచారం అందజేస్తారని పేర్కొన్నారు. ఇది మేకిన్ ఇండియా కార్యక్రమానికి గొప్ప అచివ్ మెంట్ అని పేర్కొన్నారు. 2017లో డీజీసీఏ అనుమతి ఇచ్చిన డోర్నియర్‌కు యూరొపియన్ ఏజెన్సీ కూడా ఆమోదం తెలిపింది. ఈ నెల 26న ఈఏఎస్ఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. 19 సీట్లు గల డోర్నియర్ విమానం రక్షణ విభాగం కోసం ఉపయోగించొచ్చు. ఉడాన్ పథకం కింద హెచ్ఏఎల్ దీనిని ఆవిష్కరించింది. డోర్నియర్ ప్రయోగంలో హెచ్ఏఎల్ సిబ్బంది పలు ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.

English summary
In a first, a made-in-India plane can now be used for commercial regional flights in Europe. The Directorate General of Civil Aviation (DGCA) had in end of 2017 given type certification (TC) for Hindustan Aeronautics Ltd’s (HAL)-made Dornier 228. This paved the way for the multi-purpose light transport aircraft to be used for civilian flights by regional operators in the country. Now European Union Aviation Safety Agency (EASA) has accepted DGCA certification for this plane. “Now the Dornier can be used for commercial use in Europe also. This is a big achievement for our make in India program,” DGCA chief Arun Kumar told TOI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X