వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే నిజాలు: టెక్నాలజీకి బానిసలుగా టీనేజర్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు చెడు తిరుగుళ్లతో పాటు, మద్యానికి ఎక్కడ బానిసలు అవుతారోనని తల్లిదండ్రులు తెగ బాధపడేవారు. అయితే ప్రస్తుత సమాజంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అంతేకాదు ఇప్పుడు 60 శాతానికి పైగా టీనేజర్లు స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్స్‌కు ఎక్కువగా అతుకుపోతున్నారట.

టెక్నాలజీకి టీనేర్లు బానిసలుగా మారుతున్నారని తమ పిల్లల తీరుపై తల్లిదండ్రులు బాధపడుతున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు టెక్నాలజీకి పూర్తిగా బానిసలవుతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సర్వేలో వెల్లడైంది.

teenage

పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై కామన్ సెన్స్ మీడియా ఓ సర్వే చేపట్టింది. సర్వేలో ముఖ్యాంశాలు...

* 56 శాతం మంది తల్లిదండ్రులు, 51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్‌ను చూస్తున్నట్టు ఒప్పుకున్నారు.
* 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్‌ల వల్ల తమ పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు.
* 66 శాతం తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని బాధపడ్డారు.
* 66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్ సమయంలో మొబైల్ డివైజ్ లను అనుమతిచడం లేదని చెప్పారు.
* 89 శాతం మంది టీనేజీ పిల్లలు కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు.
* 59 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలు మొబైల్ ఫోన్లకు, టాబ్లెట్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
* 50 శాతం మంది టీనేజీ పిల్లలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు.
* 27 శాతం మంది తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు.
* 28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని పేర్కొన్నారు.

English summary
Half of all teens admit they are addicted to their smartphones and other mobile devices, and nearly 60 percent of parents say they think their teens are too tech-addled, according to a new survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X