Hampi: హంపీలో అక్కాచెల్లెలు ఆత్మహత్య, అనంతపురం నుంచి వచ్చి పుణ్యస్నానాలు చేసి, ఏం జరిగింది ?
బెంగళూరు/ హంపి: ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం, విరుపాక్షపురం పుణ్యక్షేత్రంలో అక్కాచెల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన అక్కాచెల్లి తుంగభద్రా నదిలో పుణ్యస్నానం చేసిన తరువాత దేవుడి దర్శనం చేసుకుని రథం వీధిలో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కాచెల్లెలు ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
lovers: 20 రోజుల ముందు పెళ్లి, ఉరి వేసుకున్న భర్త, గొంతు కోసుకున్న భార్య, మిడ్ నైట్ ఎంట్రీతో గొడవ !

అనంతపురం అక్కాచెల్లెలు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంకు చెందిన మీనాక్షమ్మ (52), ఆమె చెల్లెలు కమలమ్మ (50) కర్ణాటకలోని హంపీ చేరుకున్నారు. హంపీలోని పలు ప్రాంతాలు సందర్శించిన మీనాక్షమ్మ, కమలమ్మ ఒక్కరోజు అక్కడే గడిపారు. రాత్రి హంపీలో మీనాక్షమ్మ, కమలమ్మ ఉన్నారని స్థానికంగా కొందరు గుర్తించారు. పొరుగు రాష్ట్రం నుంచి రావడంతో అందరిలాగా వీళ్లు హంపీని సందర్శించడానికి వచ్చారని స్థానికులు భావించారు.

తుంగభద్రా నదిలో పుణ్యస్నానాలు
తుంగభద్రా నదిలో పవిత్ర పుష్కర పుణ్యస్నానాలు చెయ్యడానికి వేలాది మంది వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో అనంతపురం నుంచి అక్కాచెల్లెలు మీనాక్షమ్మ, కమలమ్మ తుంగభద్రా నదిలో పుష్కర పుణ్యస్నానాలు చెయ్యడానికి వచ్చారని తెలిసింది. తరువాత మీనాక్షమ్మ, కమలమ్మ తుంగభద్రా నిదిలో పుష్కర పుణ్యస్నానాలు చేశారని సమాచారం.

హంపీలో విషం సేవించి ఆత్మహత్య
సోమవారం రాత్రి కమలమ్మ, ఆమె అక్క మీనాక్షమ్మ హంపీ చేరుకున్నారు. రాత్రి హంపీలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వీరుపాక్షస్వామిని దర్శించుకున్నారు. రాత్రి విరుపాక్షపురంలోని రథం వీధిలో కమలమ్మ, మీనాక్షమ్మ విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన స్థానికులు హంపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ?
పోలీసుల విచారణలో మీనాక్షమ్మ, కమలమ్మది అనంతపురం జిల్లా అని వెలుగు చూసింది. మీనాక్షమ్మ, కమలమ్మల మృతదేహాలను హోస్ పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కాచెల్లెలు కమలమ్మ, మీనాక్షమ్మల ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని హంపీ పోలీసులు అంటున్నారు.