వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హ్యాపీ బర్త్‌డే బాస్’: ఫేస్‌బుక్‌లో దావూద్ ఇబ్రహీం పుట్టినరోజు వేడుకల ఫొటోలు, అదుపులో అనుచరుడు!

|
Google Oneindia TeluguNews

ముంబై: పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన కొందరు వ్యక్తులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 26న దావూద్ ఇబ్రహీం పుట్టిన రోజు కావడంతో సదరు వ్యక్తులు వేడుకలు చేసి ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేశారు.

సోషల్ మీడియాలో దావూద్ ఇబ్రహీం పుట్టిన రోజు వేడుకలు..

సోషల్ మీడియాలో దావూద్ ఇబ్రహీం పుట్టిన రోజు వేడుకలు..

ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యక్తుల్లో ఒకడు దావూద్ ఇబ్రహీం అనుచరుడని పోలీసుల విచారణలో తేలింది. దావూద్ ఇబ్రహీం డెన్‌లో పుట్టిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను పెట్టిన ఓ వ్యక్తిని షేరా చిక్నాగా పోలీసులు గుర్తించారు. షేర్ చిక్నా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.

హ్యాపీ బర్త్ డే బాస్

హ్యాపీ బర్త్ డే బాస్

దావూద్ ఇబ్రహీంతో కలిసున్న ఫొటోలను చిక్నా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అంతేగాక, ‘హ్యాపీ బర్త్‌డే బాస్' అని కేక్‌పై రాసి దావూద్ పుట్టిన రోజు వేడుకలను చేశారు. దీంతో ఈ పోస్టుపై దర్యాప్తు చేపట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. దావూద్ ఇబ్రహీంతో వీరికి ఎలాంటి సంబంధాలున్నాయని విచారణ జరుపుతున్నారు.

దావూద్ సంబంధమేంటి?

దావూద్ సంబంధమేంటి?

ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ యాంటీ ఎక్స్టోర్షన్ విభాగం చిక్నాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. దావూద్ పుట్టిన రోజు వేడుకల వ్యవహారంపై తాము విచారణ జరుపుతున్నామని ముంబై క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సంతోష్ రస్తోగి తెలిపారు.
ఫేస్‌బుక్‌లో ఈ ఫొటోలు పెట్టిన వ్యక్తికి, ఆ ఫొటోలను ట్యాగ్ చేసిన మరో ముగ్గురికి దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధాలున్నాయనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కరాచీకి వీడియో కాల్ వెళ్లిందా?

కరాచీకి వీడియో కాల్ వెళ్లిందా?

ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీం డిసెంబర్ 26న తన పుట్టిన రోజులు వేడుకలను జరుపుకున్నారా? అవే ఫొటోలను పోస్టు చేశారా? లేక ఆ సమయంలో ఇక్కడ్నుంచి వీడియో కాల్ చేశారా? అనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. దావూద్ ఇబ్రహీం మనదేశం నుంచి పారిపోయి పాకిస్థాన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. పాక్ మాత్రం తమ దేశంలో దావూద్ లేడు అంటూ బుకాయిస్తోంది.

English summary
The Mumbai Crime Branch has detained few persons who allegedly celebrated India's most wanted fugitive gangster Dawood Ibrahim's birthday on December 26 and then posted the pictures of the same on social media platforms like Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X