వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనూసూద్ బర్త్ డే: ఉచిత వైద్య శిబిరాలతో వైద్యం, 50 వేల మందికి సేవలు, శభాష్ అంటూ నెటిజన్ల ప్రశంసలు..

|
Google Oneindia TeluguNews

సోనూ సూద్.. లాక్‌డౌన్ ముందువరకు రిల్ లైఫ్‌లో విలన్ అని తెలుసు. కానీ కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల అతనిలోని రియల్ మనస్వత్వం ప్రపంచానికి తెలుసు. ఎక్కడ ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు కదిలాడు. 20 ఏళ్లలో తాను కష్టపడి సంపాదించిన డబ్బులను మంచినీళ్లప్రాయంలా ఖర్చుచేశాడు. ఇందుకు అతని సతీమణి సోనాలీ కూడా ఏ అభ్యంతరం తెలుపకపోగా.. మరింత ప్రోత్సహించింది. అయితే నేడు సోనూ సూద్ బర్త్ డే. అంతకుముందు అయితే మామూలే.. కానీ అతను చేసిన మంచి పనుల తర్వాత జరుగుతోన్న తొలి బర్త్ డే సందర్భంగా ప్రముఖులు, హితులే కాదు.. నెటిజన్లు, ప్రజలు మనస్ఫూర్తిగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Recommended Video

#SonuSoodBirthday : Sonu Sood To Organise Free Medical Camps Across India || Oneindia Telugu
వ్యాపార కుటుంబంలో జన్మించి..

వ్యాపార కుటుంబంలో జన్మించి..

పంజాబ్‌లోని వ్యాపార కుటుంబంలో 1973లో సోనూ సూద్ జన్మించారు. అయితే ఇంటర్ కంప్లీట్ అయ్యాక.. వ్యాపారం చేసే పరిస్థితి లేదు. పంజాబ్‌లో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉండటంతో నాగ్‌పూర్ పంపించారు. అక్కడ ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్ చేశారు. తర్వాత ఎంబీఏ చేసే సమయంలో సోనాలి పరిచయమైంది. అలా వారి ప్రేమ.. పెళ్లికి దారితీసింది. సోనాలి నాగ్ పూర్‌లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలీ.. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో పెళ్లి చేసుకొన్నారు. చదువు పూర్తయ్యాక సోనూసూద్ ముంబై బాటపట్టారు. కానీ తొలినాళ్లలో అతను ఒక్కడే ముంబైలో ఉన్నారు. ఖర్చులకు నగదు సరిపోకవడంతో భార్య సోనాలి నాగ్‌పూర్‌లోనే ఉండిపోయారు. తమిళ సినిమా నుంచి కాల్ రావడంతో వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళ, బాలీవుడ్‌లో విలన్, ఆర్టిస్టుగా నటించి.. మెప్పించారు.

20 ఏళ్లలో సంపాదించింది అంత..

20 ఏళ్లలో సంపాదించింది అంత..

20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి సోనూసూద్ బాగానే డబ్బులు పోగు చేశాడు. తెలుగు, తమిళ్, బాలీవుడ్‌లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాడు. దీంతోపాటు ముంబై, ప్రధాన నగరాల్లో హాటల్ బిజినెస్ కూడా ఉంది. సినీ పరిశ్రమ, హోటల్ బిజినెస్ ద్వారా అతను రూ.130 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. కరోనా వైరస్ సమయంలో వివిధ వర్గాలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశాడు. అతను చేసిన సాయాన్ని ఎవరూ మరవలేదు. నెటిజన్లు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్

రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్

తెలుగురాష్ట్రాలకు చెందిన నాగేశ్వరరావు, టెకీ శారదకు కూడా సోనూసూద్ సాయం చేశారు. రైతు నాగేశ్వరరావు తన కూతుళ్లతో హలం దున్నుతున్న ఫోటో చూసి.. చలించిపోయారు. వెంటనే అతనికి సోనాలిక ట్రాక్టర్ పంపించారు. అయితే తర్వాత దీనిపై వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ రైతు సరదా కోసం చేశాడని వార్తలొచ్చాయి. కానీ దానిని రైతు నాగేశ్వరరావు కొట్టిపారేశారు. ఇటీవల జరిగిన టీవీ షోలో తమ ఊరు రావాలని సోనూ సూద్‌ని కోరగా.. ఆయన కూడా తిరుపతి వచ్చినప్పుడు వస్తానని మాటిచ్చారు.

టెకీ శారదకు జాబ్

టెకీ శారదకు జాబ్

వరంగల్‌కు చెందిన టెకీ శారద ఉద్యోగం కల్పించారు. లాక్ డౌన్ వల్ల శారద ఉద్యోగం కోల్పోయింది. కానీ ఆమె కుంగిపోలేదు... బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకొంది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం కాస్తా మన హీరో సోనూసూద్ వద్దకు చేరింది. ఇంకేముంది వెంటనే తన ప్రతినిధిని సోనూసూద్ ఉద్యోగం ఆఫర్ చేశాడు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త యాప్ తయారు చేయించి, అర్హతను బట్టి అందులో ఉద్యోగాలను కల్పిస్తున్నారు. అయితే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగం ఇస్తారు. అందులోనే శారదకు కూడా జాబ్ కల్పించారు.

నేడు వైద్య శిబిరాలు నిర్వహణ

నేడు వైద్య శిబిరాలు నిర్వహణ

మరోవైపు తన బర్త్ డే సందర్భంగా మరో మంచి చేయాలని సోనూ సూద్ నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందజేస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడిశాకు చెందిన పలువురు వైద్యులు దాదాపు 50 వేల మందికి వైద్య సేవలు అందిస్తారని వివరించారు. స్థానికి గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకొని.. శిబిరాలను నిర్వహిస్తామని.. అయితే సామాజిక దూరం పాటిస్తామని స్పష్టంచేశారు.

English summary
happy birthday sonu sood: free medical camps in country wide. at least 50 thousand poor people get treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X