వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/హైదరాబాద్ : ఇది వందకు వంద శాతం రసిక రాజులకు రంజైన వార్త. అలసి పోయిన శరీరాకు కాస్త ఉపశమనం కలిగించుకోవడానికి ఎక్కడో స్పా సెంటర్లకు వెళ్లే కార్యక్రమానికి ఇక స్వస్తి పలకొచ్చు. మస్సాజ్ చేసే అమ్మాయిలే ఇంటికి వచ్చి ఒంటిని మర్థన చేసి వెళ్తారు. ముంబాయి నగరంలో మొదలైన ఈ సంస్కృతి ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ఐతే ఆది లోనే ఈ వ్యవహారాన్ని ముంబాయి పోలీసులు నిలువరించడం విశేషం. నిన్నటి దాకా వ్యభిచార గృహాల్లో, లగ్జరీ హోటళ్లు, లాడ్జిల్లో సాగిన ఈ సెక్స్ రాకెట్ దందా... ఆన్ లైన వైపు తిరిగింది.

ఎవరికీ అనుమానం రాకుండా స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న మూఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. స్పా సర్వీస్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా విటుల ఇంటి వద్దకే వ్యభిచారిణులను పంపి జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాదని, విటుల, వ్యభిచారిణుల భద్రతకు సమస్య ఉండదని ఈ దారిని ఎంచుకున్నారు. మసాజ్ చేస్తామని, కావాలంటే ఇంటి వద్దకే వచ్చి చేస్తారని చెప్పి.. ఆ తర్వాత మీకు ఎలాంటి మసాజ్ అంటే ఇష్టం అని అడిగి.. లోకల్ మసాజ్, ఇంటర్నేషనల్ మసాజ్ అంటూ.. దేశీ, విదేశీ యువతులతో ముంబైలో భారీ స్థాయిలో వ్యభిచారం సాగిస్తున్నారు. కస్టమర్‌ పేరుతో పోలీసులు ఆ నిర్వాహకున్ని బురిడి కొట్టించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.

Happy News For body massage lovers.! Homemade massage..!!

ఇక వివరాలలోకి వెళితే ... ముంబైలో రజ్నేష్ వెల్‌నెస్ లిమిటెడ్ పేరుతో ముప్పై ఐదేళ్ల రజ్నేష్ సింగ్ స్పా సెంటర్ పెట్టి.. వెనకాల నుంచి వ్యభిచారం నడిపిస్తున్నాడు. అతడి వద్ద ఐదుగురు యువతులు ఉంటారు. ఇంటి వద్దకే స్పా సర్వీస్ అని చెప్పి ప్రకటన ఇచ్చాడు. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేసి.. తాను కస్టమర్‌ను అంటూ వివరాలు ఆరా తీశారు.

పక్కా ప్రణాళికతో అంథేరీ లోని ఓ హోటల్‌కు ముగ్గురు యువతులను పంపాలని కోరాడు. నిజంగా కస్టమర్ కావచ్చని యువతులను సంబంధిత అడ్రస్‌కు వారిని పంపాడు. ఆ యువతులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. మిగతా ఇద్దరు యువతులు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.70లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశం పై ముంబాయి పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

English summary
Thirty-five-year-old Rajnesh Singh has set up a spa in the name of Rajneesh Wellness Limited in Mumbai. He has five young women. At home, he declared that the spa service. However, when the suspected police phoned the number of the advertisement, he called the customer and asked for details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X