వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కోడ్ ఉల్లంఘన: మంత్రి హారక్ సింగ్‌కు మూడు నెలల జైలు

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ఉత్తరాఖండ్ మంత్రి హారక్ సింగ్ రావత్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 1000లు జరిమానా కూడా వేసింది.

2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరక్ సింగ్ రావత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. దీనిపై తుది విచారణ జరిపిన రుద్రప్రయాగ్‌లోని న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 143 ప్రకారం మంత్రి రావత్‌ను దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఈ మేరకు వివరాలను ప్రాసిక్యూషన్ లాయర్ మమత మనదులి తెలిపారు.

Harak Singh Rawat given 3-month jail for violating poll code of conduct

అయితే, కోర్టుకు హాజరైన మంత్రి రావత్‌కు బెయిల్ మంజూరైంది. కాగా, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రావత్.. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు నేరపూరిత చర్యలకు పాల్పడంతో అప్పట్లో రావత్‌పై కేసు నమోదైంది. కాగా, ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రావత్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ సీఎం జైరాం ఠాకూర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

English summary
Later in the day, Harak Singh Rawat was granted bail in the case to appeal before the appellate court, said a lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X