వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో, ఫోన్లో అసభ్య మెసెజ్‌లు: మహిళ ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harassment via Facebook, woman committed suicide
కొచ్చి: ఫేస్‌బుక్‌లో తనపై అభ్యంతరకర, అసభ్య మెసేజ్‌లు పెట్టడంతో ఇరవై ఏడేళ్ల మహిళ తన ఫ్లాట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా చిత్తోర్‌కు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ ఉంది.

ఆమెకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి అసభ్యకర సందేశాలు పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆమె సెల్‌ఫోన్‌కు అభ్యంతరకర సందేశాలు పంపించాడు. ఈ కారణంగా ఆదివారం ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

బంధువులు ఫిర్యాదు చేస్తే ఆధారాలు లేవని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

మరోవైపు ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసు నమోదు చేయలేదని, అంతేకాకుండా ఇరు వర్గాలు చర్చించుకొని అండర్ స్టాండింగ్‌కు వచ్చాయని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారట.

మృతి చెందిన మహిళ తన భర్త, రెండేళ్ల చిన్నారితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలియడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

English summary
A woman in Ernakulam district of Kerala allegedly committed suicide after a relative posted obscene messages about her on Facebook. Her family claimed that the police took no action when they approached them.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X