వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీజీ ఇలాంటి దారుణాలను సహించొద్దు: హర్భజన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒక ఫొటో పోస్టు చేశారు. ఆ ఫొటోలో ఒక మహిళను పోలీస్ కానిస్టేబుల్ తన లాఠీతో చితకబాదుతున్నాడు. ఆమె చేతిలో చంటి బిడ్డ కూడా ఉంది.

ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో హర్భజన్ పోస్టు చేశాడు. ఇటువంటి దారుణాలను ఎంతమాత్రం సహించలేమని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. చితక బాదితే ఎలా? అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇటువంటి దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తాయని అన్నారు.

అంతేగాక, మన దేశం గురించి తెలియజెప్పేవి ఇటువంటి ఫొటోలా? చాలా అవమానకరమంటూ హర్భజన్ సింగ్ ఆ ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మంది భజ్జీకి మద్దతుగా నిలవగా, కొందరు ఎక్కడో ఘటన జరిగితే మోడీది బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాల పోలీసులు ప్రధాని ఆధీనంలో ఉండరని అన్నారు.

వారి విమర్శలపై భజ్జీ కూడా ఘాటుగానే స్పందించాడు. తాను మోడీని బ్లేమ్ చేయడం లేదని, ఇలాంటి ఏ రాష్ట్రంలో జరిగినా సహించొద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పాడు. ఆయన మన ప్రధాని కాబట్టి ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లానని తెలిపాడు.

English summary
Harbhajan Singh on Monday reacted strongly to a policeman hitting a woman, with possibly her child in her hand, with a stick. The offie received numerous responses to his original tweet, addressed to PM Narendra Modi, with some suggesting the Mumbai Indians bowler was creating a political angle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X