వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏక్తా యాత్ర: సూరత్‌లో హార్దిక్ పటేల్ అరెస్ట్, ఉద్రిక్తత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అహ్మాదాబాద్: గుజరాత్‌లో 'ఏక్తా యాత్ర' దృష్ట్యా సూరత్ నగరంలో హార్దిక్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హార్దక్ పటేల్‌తో పాటు దాదాపు 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పటేల్ వర్గీయల ఆందోళనతో గుజరాత్‌లో ఉద్రిక్తత నెలకొంది.

గుజరాత్ ప్రభుత్వం అనుమతితోనే సూరత్‌లో 23 ఏళ్ల హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపునకు మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 12 శాతం ఉన్న పటేల్ సమాజిక వర్గం ప్రజలు రోడ్డెక్కారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హార్దిక్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Hardik Patel arrested by gujarat police on Saturday

గతంలో మాదిరిగానే ఈరోజు సూరత్‌లో తలపెట్టిన ఈ ర్యాలీకి కూడా పటేల్ వర్గీయలు పెద్దఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పటేల్ వర్గీయులు తలపెట్టిన ఈ ర్యాలీని అడ్డుకునే క్రమంలోనే పోలీసులు హార్దిక్ పటేల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓబీసీ చేర్చి, విద్యార్ధులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో గత కొంతకాలంగా హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీకి కీలక ఓటుబ్యాంకుగా ఉన్న పటేల్ వర్గంలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్ తన వర్గంపై మంచి పట్టు సాధించారు.

 Hardik Patel arrested by gujarat police on Saturday

గతంలో అహ్మాదాబాద్‌లో తలపెట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పటేళ్లు ఆందోళనపై జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాల్లో పటేళ్లకు ఎప్పటికీ రిజర్వేషన్లు దక్కే అవకాశాళు ఎంతమాత్రం లేదని ఆయన తెలిపారు.

రిజర్వేషన్ల కోసం పటేళ్లు చేస్తున్న ఆందోళన ఎప్పటికీ నెరవేరబోదని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో జరుగుతున్న పటేళ్ల ఉద్యమం వెనుక రాజకీయ శక్తులున్నాయని, త్వరలోనే వారెవరన్నది బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పటేళ్ల ఆందోళనల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందా? లేక బీజేపీయే స్వయంగా ఇదంతా చేయిస్తుందా? అన్న విషయాలపై తాను వ్యాఖ్యానించబోనని అన్న సంగతి తెలిసిందే.

English summary
Hardik Patel arrested by gujarat police on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X