వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్దిక్ పటేల్‌కు కోర్టులో చుక్కెదురు: నో బెయిల్

|
Google Oneindia TeluguNews

సూరత్: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ కు కోర్టులో మళ్లీ చుక్కెదురైయ్యింది. హార్దిక్ పటేల్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. హార్దిక్ పటేట్ కు బెయిల్ ఇవ్వలేమని సూరత్ కోర్టు తేల్చి చెప్పింది.

గుజరాత్ లో పటేళ్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇవ్వాలని హార్దిక్ పటేల్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు. ఈ ఉద్యమంలో పలు చోట్ల ఘర్షణలు జరిగి ఆస్తి నష్టం కూడా జరిగింది. గుజరాత్ లో హార్ధిక్ పటేల్ మీద పలు కేసులు నమోదు అయ్యాయి.

ఇదే సందర్బంలో మన రిజర్వేషన్ల కోసం అవసరమైతే పోరాటం చేద్దాం అంతే కాని యువత ఆత్మహత్యలు చేసుకోరాదని హార్దిక్ పటేల్ రెచ్చగొట్టారు. రిజర్వేషన్ల కోసం అవసరమైతే పోలీసులను చంపాలని పిలుపునిచ్చారు.

Hardik Patel bail plea rejected

గత అక్టోబర్ నెలలో హార్దిక్ పటేట్ మీద సూరత్ లో దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. గత నెల 16వ తేదిన హార్దిక్ పటేల్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తన మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని హార్దిక్ పటేల్ కోర్టును ఆశ్రయించారు.

తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని సూరత్ జిల్లా కోర్టులో అర్జీ సమర్పించారు. అయితే హార్దిక్ పటేల్ కు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోర్టులో మనవి చేశారు. హార్దిక్ పటేల్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

English summary
The bail plea of Patel quota agitation leader Hardik Patel was rejected on Thursday by a district and sessions court in Surat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X