వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: హర్ధిక్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: మరికొద్ది గంటల్లోనే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అదే సమయంలో గుజరాత్ ఎన్నికల ఫలితాలపై పాటీదార్ల నేత హర్ధిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. 17 జిల్లాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

ఎబిపి ఎగ్జిట్ పోల్స్: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బిజెపిదే హవాఎబిపి ఎగ్జిట్ పోల్స్: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బిజెపిదే హవా

గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 18న, వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బిజెపి నేతల్లో ఆనందాన్ని నింపాయి. అయితే కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు కొంత నిరాశను కల్గించాయి.

నాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనంనాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనం

అయితే కొన్ని గంటల్లోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన పటీదార్ల నేత హర్దిక్ పటేల్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

 గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్

గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్

గుజరాత్ అసెంబ్లీ ఫలితాలు కొన్ని గంటల్లో రానున్నాయి. ఈ సమయంలో పటీదార్ల నాయకుడు హర్దిక్ పటేల్ బిజెపిపై సంచలన ఆరోపణలు చేశారు. విజయం కోసం బిజెపి ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదన్నారు.ఇందు కోసం ఈవీఎంలను ట్యాంపరింగ్ కూడ చేసేందుకు బిజెపి వెనుకాడదని ఆయన ఆరోపించారు.17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

 ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హార్థిక్‌ పటేల్‌ వరుస ట్వీట్లలో సూచించారు. ఈ ట్వీట్లను పటీదార్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున షేర్‌ చేసుకుంటున్నారు. అయితే హర్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారోననే చర్చ కూడ సాగుతోంది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే బిజెపి గెలుపు సాధ్యం

ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే బిజెపి గెలుపు సాధ్యం

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారానే గుజరాత్‌ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్‌ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోందని హర్ధిక్ పటేల్ ఆరోపించారు.

కాంగ్రెస్ గెలుపుకు ఈవీఎంల అడ్డుకట్ట

కాంగ్రెస్ గెలుపుకు ఈవీఎంల అడ్డుకట్ట

ఈవీఎం రిగ్గింగ్‌కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్‌లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లేనని హార్థిక్‌ అన్నారు. ఈవీఎంలను పక్కనబెట్టి మళ్లీ బ్యాలెట్‌ బ్యాక్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని హార్థిక్‌ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.

English summary
After the unprecedented mobilising of people against the BJP ahead of the Gujarat assembly elections, PAAS leader, Hardik Patel, continued to fuel fears about EVM tampering through multiple tweets asking the people to remain alert so that the ruling BJP does not make any attempt to cheat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X