వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈనెల 27న పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను మ్యారేజ్ చేసుకోనున్నాడు. అయితే తన పెళ్లి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా చేసుకోనున్నాడు హార్ధిక్. ఉద్యమనేతగా ఫాలోయింగ్ ఉన్నా.. కేవలం 100 మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుండటం గమనార్హం.

పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

గుజరాత్ లో పటీదార్ ఉద్యమాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లి సంచలనంగా మారిన హార్ధిక్ పటేల్ మరోసారి వార్తల్తోకెక్కాడు. ఈసారి ఉద్యమంతో కాకుండా పర్సనల్ లైఫ్ తో న్యూస్ గా మారాడు. 25 ఏళ్ల వయస్సున్న హార్ధిక్ పటేల్ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయాడు. తాను పెళ్లాడబోతున్న యువతితో పరిచయం చాలా పాతదే. చిన్నప్పుడు తన చెల్లితో కలిసి చదువుకున్న కింజల్ పారిఖ్ ను హార్ధిక్ వివాహం చేసుకోబోతున్నాడు. తన చెల్లి కోసం వీరి ఇంటికి ఆమె తరచుగా వస్తుండేదట. ఆ క్రమంలో ఏర్పడిన పరిచయం పెళ్లికిలా దారి తీసింది. ఈనెల 27న ఇరువురి కుటుంబాల సమక్షంలో అతి సింపుల్ గా వీరి మ్యారేజ్ జరగనుంది.

బతికి సాధిస్తా: 19వ రోజున దీక్ష విరమించిన హార్ధిక్ పటేల్ బతికి సాధిస్తా: 19వ రోజున దీక్ష విరమించిన హార్ధిక్ పటేల్

 ఆర్బాటాలు లేకుండా..!

ఆర్బాటాలు లేకుండా..!

పెళ్లికూతురు ఆయనకంటే రెండేళ్లు చిన్నది. ఈ వివాహ వేడుకకు కేవలం వంద మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఎలాంటి ఆర్బాటాలు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉంజాలోని ఉమియా ధామ్ టెంపుల్ లో వీరి వివాహం జరపాలని అనుకుంటున్నారు. అయితే హార్ధిక్ పటేల్ ఉంజాకు రావొద్దన్న కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ పెళ్లి జరగకపోవచ్చని సమాచారం. అదలావుంటే సురేంద్ర నగర్ జిల్లాలోని డిన్సార్ గ్రామంలో హార్ధిక్ - కింజల్ మ్యారేజ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

రెండు కుటుంబాలు ఓకే..!

రెండు కుటుంబాలు ఓకే..!

పెళ్లికూతురు కింజల్ పారిఖ్ కుటుంబం స్వస్థలం అహ్మదాబాద్ జిల్లాలోని విరంగం పట్టణం. అయితే కొన్నాళ్ల కిందట సూరత్ లో సెటిలయ్యారు. విరంగం టౌన్ కు కొద్దిదూరంలోని చందన్ నగరి గ్రామానికి చెందినవాడు హార్ధిక్. పరిఖ్ - పటేల్ కమ్యూనిటీకి చెందిన కింజల్ కామర్స్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం గాంధీనగర్ లో ఎల్ఎల్‌బీ చదువుతోంది. చిన్ననాటి నుంచి వీరిద్దరు మంచి స్నేహితులని, ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని చెబుతున్నారు హార్ధిక్ తండ్రి భరత్ పటేల్.

English summary
Gujarat Patidar quota leader, Hardik Patel, is all set to tie the knot with his childhood friend Kinjal Parikh on 27th january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X