కాంగ్రెస్ కు హార్ధిక్ పటేల్ గుడ్ బై- బీజేపీలో చేరేందుకు రెడీ- గుజరాత్ ఎన్నికల వేళ భారీ షాక్
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న గుజరాత్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా నాలుగుసార్లు గెలిచి ఐదోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఇవాళ హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గొడవల మధ్య పాటిదార్ నేత హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే తన రాజీనామా పత్రాన్ని కూడా షేర్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంపై హార్ధిక్ తీవ్ర విమర్శలు చేశారు. హార్దిక్ పటేల్ తన లేఖలో "గుజరాత్లోని కాంగ్రెస్ పెద్ద నాయకులు రాష్ట్ర సమస్యలకు దూరంగా ఉన్నారని, అయితే ఢిల్లీ నుండి వచ్చిన నాయకులకు చికెన్ శాండ్విచ్ను అందించడంపై ఎక్కువ దృష్టి సారించారని, సమయానికి దాన్ని అందించారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారపు.

కాంగ్రెస్ను
సరైన
దిశలో
నడిపించేందుకు
అనేక
ప్రయత్నాలు
చేసినప్పటికీ,
ఆ
పార్టీ
నిరంతరం
దేశ,
సమాజ
ప్రయోజనాలకు
వ్యతిరేకంగా
పనిచేస్తోందని
హార్ధిక్
పటేల్
తన
లేఖలో
పేర్కొన్నారు.పార్టీ
సీనియర్
నాయకత్వానికి
సీరియస్
నెస్
లేదని
పటేల్
ఆరోపించారు.
"నేను
సీనియర్
నాయకత్వాన్ని
కలిసినప్పుడల్లా,
గుజరాత్
ప్రజలకు
సంబంధించిన
సమస్యలను
వినడానికి
నాయకులు
నిజంగా
ఆసక్తి
చూపరని
నేను
ఎప్పుడూ
భావించాను,
కానీ
వారు
తమ
మొబైల్లో
ఏ
సందేశాలు
అందుకున్నారనే
దానిపై
ఎక్కువ
నిమగ్నమై
ఉన్నారు..."
అని
పటేల్
తెలిపారు.
ఇకపై
నిజంగా
మన
రాష్ట్ర
ప్రజల
కోసం
సానుకూలంగా
పని
చేయగలనని
నమ్ముతున్నానని
పేర్కొన్నారు.