వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లి

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. సురేంద్ర నగర్ జిల్లా మౌలి తాలూకా దిగ్సర్ ప్రాంతంలోని ఓ టెంపుల్ లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే త్వరలో అతిథులకు, మిత్రులకు అహ్మదాబాద్ లో విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'

పటీదార్ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 2016లో జైలుశిక్ష అనుభవించాడు హార్ధిక్ పటేల్. ఆ సమయంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. హార్దిక్ పటేల్ చెల్లెలి క్లాస్‌మేట్ కావడంతో తరచుగా వారి ఇంటికి వచ్చేవారట కింజల్. అలా పరిచయంగా కాస్తా పెళ్లికి దారితీసింది. 25 ఏళ్ల వయస్సున్న హార్ధిక్ కంటే ఆమె రెండేళ్లు చిన్నది.

hardik patel got married with childhood friend kinjal parikh

కింజల్ పారిఖ్ కుటుంబం స్వస్థలం అహ్మదాబాద్ జిల్లాలోని విరంగం పట్టణం. అయితే కొన్నాళ్ల కిందట సూరత్ లో సెటిలయ్యారు. విరంగం టౌన్ కు కొద్దిదూరంలోని చందన్ నగరి గ్రామానికి చెందినవారు హార్ధిక్. పరిఖ్ - పటేల్ కమ్యూనిటీకి చెందిన కింజల్ కామర్స్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం గాంధీనగర్ లో ఎల్ఎల్‌బీ చదువుతున్నారు.

English summary
Gujarat Patidar quota leader, Hardik Patel got married with Kinjal Parikh who was his childhood friend. Only a few close relatives and friends were invited to wedding ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X