వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000కోట్ల ప్యాకేజీకి వ్యతిరేకంగా 'లాలీపాప్‌' ఉద్యమం

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసేందుకు లాలీపాప్‌ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పటీదార్‌ అనామత్‌ ఆందోళన సమితి(పీఏఏఎస్‌) నేత హార్దిక్‌ పటేల్‌ ప్రకటించారు. విద్యార్థులకు సర్కారు ప్రకటించిన ప్యాకేజీ పటేల్‌ వర్గానికి లాలీపాప్‌ వంటిదని ఆయన ఆరోపించారు.

ఈ ఆందోళనలో భాగంగా అన్ని గ్రామాలు, తాలూకాల్లో రహదారులపై పటేల్‌ వర్గీయులకు లాలీపాప్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, రాజ్‌కోట్‌ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉద్యమం ప్రారంభమైంది.

Hardik Patel launches ‘lollipop movement’ against package for economically weak

సెప్టెంబర్ 29 వరకు ఎలాంటి ఉద్యమాన్ని ప్రారంభించబోమని గురువారం హైకోర్టుకు హామీ ఇచ్చిన హార్దిక్‌.. లాలీపాప్‌ ఉద్యమాన్ని చేపట్టాలంటూ తమ వర్గ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఆగస్టు 26న తమ వర్గీయుల బలిదానానికి నివాళిగా శనివారం ఇళ్లల్లో కొవ్వొత్తులు వెలిగిస్తామన్నారు.

'ముఖ్యమంత్రి యువ స్వావలంబన యోజన' పేరిట గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. దీనికింద కులాలతో సంబంధం లేకుండా కుటుంబ వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించని విద్యార్థులందరికీ రుసుముల మాఫీ జరుగుతుంది.

English summary
Patidar leader Hardik Patel on Friday announced a “lollipop movement” to express displeasure over the Gujarat government’s package for students belonging to the Economically Weaker Section (EWS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X