వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు || Oneindia Telugu

అహ్మదాబాద్ : ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. హార్దిక్ మాట్లాడుతుండగా మైక్ వద్దకు వచ్చిన వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సురేంద్రనగర్‌లోని బల్దానాలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చిన ఓ వ్యక్తి హార్దిక్‌పై దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో తొలుత షాక్ తిన్న హార్దిక్ వెంటనే ఆ వ్యక్తిని తోసేశాడు. ఈ లోపు పార్టీ కార్యకర్తలు, ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

<strong>ఓటు ఒకరికి వేయబోయి మరొకరికేశాడు... తన తప్పుకు శిక్ష విధించుకున్నాడు ఏంటా శిక్ష?</strong>ఓటు ఒకరికి వేయబోయి మరొకరికేశాడు... తన తప్పుకు శిక్ష విధించుకున్నాడు ఏంటా శిక్ష?

Hardik Patel slapped during a public meeting in Gujarat

హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే తాను దాడి చేశానని సదరు వ్యక్తి చెప్పాడు. పటేల్ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియలేదు. ఘటన అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన హార్దిక్ తనను భయభ్రాంతులకు గురిచేసేందుకే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

English summary
In a shocking incident, Congress leader Hardik Patel was slapped at a public meeting in Gujarat on Friday morning. Patel was slapped in Gujarat’s Surender nagar district during a Jan Aakrosh Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X