వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్

|
Google Oneindia TeluguNews

లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికల కోసం భారత వాతావరణశాఖ(ఐఎండీ) ప్రత్యేక సూచనలను అందించనుంది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. లదాఖ్‌లో వాతావరణం తరచూ మారుతూ ఉంటుందని, ఇది స్థానికులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. అలాగే దేశ భద్రత, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Harsh Vardhan inaugurates Indias highest meteorological centre at Leh

కాగా, ఇది హిమాలయాల్లో ఏర్పాటు చేసిన రెండో వాతావరణ కేంద్రం. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లోనూ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఐఎండీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది ఇలావుంటే, ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంది. మనాలి నుంచి లేహ్ వరకు 9.2 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ టన్నెల్‌ను ప్రారంభించారు.

English summary
Union Minister of Science and Technology Harsh Vardhan inaugurated a Meteorological (Met) Centre at Leh (Ladakh) via video conferencing on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X