హర్షద్ మెహతా నుంచి నీరవ్ మోడీ వరకు... గుణపాఠాలు నేర్చుకోని బ్యాంకులు!

ముంబై: ఒక పొరపాటుగాని, తప్పుగాని జరిగినప్పుడు చాలామంది వెంటనే జాగ్రత్తపడిపోతారు. మరలా ఆ తప్పు లేదా పొరపాటు చేయరు. కానీ కొంతమంది మాత్రం తీవ్ర నష్టం జరిగాకగాని గుణపాఠం నేర్చుకోరు. ఇంకొంతమంది జీవితంలో ఎంత పెద్ద దెబ్బతగిలినా, నష్టం భరించలేని స్థాయిలో ఉన్నా సరే, గుణపాఠం మాత్రం నేర్చుకోరు, మళ్లీ ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోరు.

మనదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. ఎందుకంటే హర్షాద్ మెహతా స్కాం నుంచి నేటి నీరవ్ మోడీ స్కాం వరకు ఎన్ని జరిగినా, ఎన్ని వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతున్నా.. బ్యాంకులు, వాటి యాజమాన్యాలు ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పేరుకుపోతున్న మొండిబాకాయిలకు తోడు భారీ ఎత్తున ఆర్థిక మోసాలు జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి.

ముందు రుణాలు ఇచ్చేసి ఆపైన...

ముందు రుణాలు ఇచ్చేసి ఆపైన...

దేశంలో ప్రైవేటు బ్యాంకులకు ఏమాత్రం పోటీ ఇవ్వ‌లేని స్థితిలో ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు కాలానికి త‌గ్గ‌ట్లు మార‌డం లేదు స‌రికదా రుణాలు ఇవ్వ‌డంలో నిబంధ‌న‌ల‌ను గాలికి వ‌దిలేస్తున్నాయి. దిగువ, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇచ్చిన రుణాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే బ్యాంకులు ఉన్నతదాయ, కార్పొరేట్ వర్గాలకు ఇచ్చే రుణాలను మాత్రం వసూలు చేయలేకపోతున్నాయి. ఫలితంగా అన్ని ప్రభుత్వ బ్యాంకులనూ ‘మొండిబకాయిలు' పెద్ద గుదిబండగా మారుతున్నాయి.

మహామాయగాడు హర్షద్ మెహతా...

మహామాయగాడు హర్షద్ మెహతా...

తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ స్కాం వెలుగుచూశాక 1992 నాటి హర్షద్ మెహతా స్కాం గుర్తుకు రాక తప్పదు. మహా మాయగాడైన హర్షద్ మెహ‌తా కొన్ని బ్యాంకుల నుంచి న‌కిలీ ర‌సీదుల ద్వారా మరికొన్ని బ్యాంకుల నుంచి అప్పుల కింద కోట్లు సేక‌రించి ఆ సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాడు. స్టాక్ మార్కెట్ గ‌రిష్ట స్థాయిల‌కు వెళ్లి క్రాష్ అవ‌డానికి కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే త‌న స్టాక్ విలువ‌ల‌ను పెంచి, పెట్టుబ‌డి పెట్టిన సొమ్మును వెన‌క్కి తీసేసుకున్నాడు. అయితే ఆయా బ్యాంకుల వద్ద రుణం తీసుకునేటప్పుడు అతడు హామీగా ఉంచిన పత్రాలన్నీ నకిలీవి, ఏమాత్రం విలువలేనివి.

కేతన్ పరేఖ్, విజయ్ మాల్యా...

కేతన్ పరేఖ్, విజయ్ మాల్యా...

2001లో కేత‌న్ ప‌రేఖ్ కుంభ‌కోణం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మ‌రో మాయ‌ని మ‌చ్చ‌. ఇత‌డు కూడా బ్యాంకు నిధుల‌ను స్టాక్ మార్కెట్ వైపు మళ్లించాడు. ఇక లిక్కర్ డాన్ విజ‌య్ మాల్యా కూడా బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయాడు. మాల్యా దాదాపు రూ.9000 కోట్లు(వ‌డ్డీతో క‌లిపి) బ్యాంకుల‌కు బ‌కాయి ప‌డ్డాడు. దాదాపు 17 బ్యాంకుల నుంచి తీసుకున్న డ‌బ్బును నిర్దేశించిన దానికి కాకుండా వివిధ రకాల వ్యాపారాల్లోకి ఇతడు మార్చాడు. ఆ డబ్బుతో చాలా చోట్ల పెట్టుబ‌డులు పెట్టాడు.

నీరవ్ మోడీ అలా కాదు...

నీరవ్ మోడీ అలా కాదు...

తాజాగా పీఎన్‌బీకి రూ.11,400 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మాత్రం గతంలో స్కాంలకు పాల్పడిన హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌ల మాదిరిగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టలేదు. హర్షద్ మెహతా మాదిరిగానే బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు బ్యాంకు అధికారుల్లో కొంతమందిని మచ్చిక చేసుకుని నకిలీ బ్యాంకు పత్రాల ద్వారా విదేశాల్లోని బ్యాంకు శాఖల నుంచి నీరవ్ మోడీ రుణాలు పొందాడు. పైగా తాను అసలు అన్ని వేల కోట్ల రుణాలు తీసుకోనేలేదని, పంజాబ్ నేషనల్ బ్యాంకు తన రుణాలను తీసుకున్నదానికంటే అధికంగా చూపిస్తోందని ఎదురుదాడి కూడా చేశాడు.

గుణపాఠాలు నేర్చుకోని బ్యాంకులు...

గుణపాఠాలు నేర్చుకోని బ్యాంకులు...

హ‌ర్ష‌ద్ మెహ‌తా నుంచి నీరవ్ మోడీ వ‌ర‌కూ ఏ కార్పొరేట్ రుణ ఎగ‌వేత‌ను చూసినా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల వైఫ‌ల్య‌మే కొట్టొచ్చిన‌ట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతమంది ఎన్నిసార్లు ఆర్థిక మోసాలకు పాల్పడినా బ్యాంకులకు మాత్రం బుద్ధి రావడం లేదు. రుణ ఎగ‌వేత కేసులు అధికమవకుండా అవి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోలేకపోతున్నాయి. నియమ నిబంధనలు గాలికొదిలేయడం, ప‌ర్య‌వేక్ష‌ణ‌ లోపం.. వీటివల్లే ఆర్థిక మోసాలు అధికమవుతున్నాయి. ఎన్‌పీఏల‌తో, మోసాల‌తో బ్యాంకులు కుదేలైనప్పుడల్లా కేంద్ర ప్ర‌భుత్వం మూల‌ధ‌నాన్ని స‌మ‌కూరుస్తూ వస్తోంది. ఈ మూలధనం ఎవరిది? ఎక్కడిది? అదంతా ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి వచ్చిందే! అలాంట‌ప్పుడు బ్యాంకులు ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మరి ప్రభుత్వ రంగ ఇకనైనా గుణపాఠాలు నేర్చుకుంటాయా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+