వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యవేడు శ్రీసిటీలో కేంద్రమంత్రి హర్సిమ్రత్కౌర్, కితాబు
హైదరాబాద్: కేంద్ర ఆహారశుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శనివారం చిత్తూరు జిల్లాలోని సత్యవేులో గల శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ఉత్పాదక సంస్థల అధినేతలతో సమావేశమై ఆమె వారికి పలు సూచనలను చేశారు.
స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు యువత కోసం శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిపుణులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యాజమాన్యాల పైన ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రత్యేక ఆర్థిక మండలిలో సత్వయేడు శ్రీసిటీ తక్కువ కాలంలోనే లక్ష్య సాధన దిశగా పయనించడం అభినందనీయమన్నారు. శ్రీ సిటీ మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు ఉపాధి విషయంలో స్థానికులకు పెద్దపీట వేయాలని సూచించారు. అనంతరం కాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్ సంస్థల ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి పలు పరిశ్రమలను పరిశీలించారు.