వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BJP‘B’గ్రూప్ JJP:హరియాణాలో అసమ్మతి సెగ, సీఎం మీద పోటీ, దుశ్యంత్ ద్రోహం !

|
Google Oneindia TeluguNews

చండిగడ్/న్యూఢిల్లీ: హరియాణాలో bJP, జననాయక్ జనతా పార్టీ (JJP) దోస్తితో అప్పుడే అసమ్మతి సెగ మొదలైయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో చెయ్యి కలిపిన జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా తీరును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకుడు, మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. జననాయక్ జనతా పార్టీ (JJP) నుంచి తాను బయటకు వెళ్లిపోతున్నానని శనివారం తేజ్ బహుదూర్ యాదవ్ చెప్పారు. జేజేపీ హరియాణా ప్రజలకు ద్రోహం చేసి బీజేపీతో పొత్తు పెట్టుకుందని తేజ్ బహుదూర్ యాదవ్ ఆరోపించారు. BJPకి 'B'గ్రూప్ గా JJP తయారైయ్యిందని తేజ్ బహుదూర్ యాదవ్ ఆరోపించారు.

బీఎస్ఎఫ్ ఉద్యోగం !

బీఎస్ఎఫ్ ఉద్యోగం !

తేజ్ బహుదూర్ యాదవ్ బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేసేవారు. బీఎస్ఎఫ్ జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారని, మా కష్టాలు ఎవ్వరికి రాకూడదని ఆరోపిస్తూ 2017లో తేజ్ బహుదూర్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వీడియో విడుదల చేశారు. తేజ్ బహుదూర్ విడుదల చేసిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురైన తేజ్ బహుదూర్ యాదవ్ ను బీఎస్ఎఫ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

దుశ్యంత్ సమక్షంలో జేజేపీ తీర్థం

దుశ్యంత్ సమక్షంలో జేజేపీ తీర్థం

బీఎస్ఎఫ్ నుంచి సస్పెండ్ అయిన తేజ్ బహుదూర్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీఎస్ఎఫ్ లోని సీనియర్ అధికారుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగం పోవడంతో హరియాణా అసెంబ్లీ ఎన్నికల ముందు గత సెప్టెంబర్ నెలలో జననాయక్ జనతా పార్టీ (JJP) చీఫ్ దుశ్యంత్ చౌటాలా సమక్షంలో తేజ్ బహుదూర్ యాదవ్ ఆ పార్టీలో చేరారు.

సీఎం ఖట్టర్ మీద పోటీ !

సీఎం ఖట్టర్ మీద పోటీ !

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ (JJP)అభ్యర్థిగా పోటీ చేసిన తేజ్ బహుదూర్ యాదవ్ ఓడిపోయారు. తరువాత హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం, కేంద్ర మంత్రి అమిత్ షా చక్రం తిప్పడం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో దుశ్యంత్ చౌటాలా బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు.

హరియాణా ప్రజలకు ద్రోహం

హరియాణా ప్రజలకు ద్రోహం

హరియాణా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలని బీజేపీ జననాయక్ జనతా పార్టీ (JJP) బహిరంగంగా తలుపులు తెరించింది. బీజేపీ నాయకుల ఆఫర్ కు జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా ఓకే చెప్పారు. దుశ్యంత్ చౌటాలా నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ జేజేపీ నుంచి బయటకు వచ్చేశారు.

BJPకి ‘B’బి గ్రూప్ JJP

BJPకి ‘B’బి గ్రూప్ JJP

హరియాణా ప్రజలకు ద్రోహం చేసిన దుశ్యంత్ చౌటాలా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ప్రజలు వారిని క్షమించరని తేజ్ బహుదూర్ యాదవ్ ఆరోపించారు. నేటి పరిస్థితులు గమనిస్తుంటే BJPకి‘బి'JJP అని అర్థం అవుతోందని బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ విమర్శించారు. బీజేపీ, జేజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ రోజు ఎంతో దూరం లేదని ఆరోపించిన మాజీ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ మండిపడుతున్నారు.

ప్రజల పరువు తీశారు

ప్రజల పరువు తీశారు

హరియాణా ప్రజలకు నమ్మకద్రోహం చేసిన దుశ్యంత్ చౌటాలా జేజేపీ పరువు తీశారని తేజ్ బహుదూర్ యాదవ్ మండిపడుతున్నారు. తేజ్ బహుదూర్ యాదవ్ పార్టీ నుంచి బయటకు వచ్చి బహిరంగంగా విమర్శలు చెయ్యడంతో ఉలిక్కిపడిన దుశ్యంత్ చౌటాలా, జేజేపీ నాయకులు అసమ్మతి సెగ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

English summary
New Delhi: JJP candidate Tej Bahadur Yadav, who had contested the Haryana assembly elections against Manohar Lal Khattar, has announced that he will quit the party because of the party tying up with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X