వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకు దాడి!: హర్యానా సీఎంకు చేదు అనుభవం..

|
Google Oneindia TeluguNews

చండీఘడ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పై ఓ వ్యక్తి ఇంకు దాడి చేశాడు. గురువారం హిసార్ పట్టణంలో నిర్వహించిన ఓ రోడ్ షోలో పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.

ఇంకు దాడి చేసిన వ్యక్తి తాను తాను ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) కార్యకర్తనంటూ పెద్దగా నినాదాలు చేశాడు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

ఇంకు దాడి జరిగినప్పటికీ.. ఖట్టర్ తన రోడ్ షో కొనసాగించారు. ముఖంపై పడిన ఇంకును చేతి రుమాలుతో తుడిచేసుకున్నారు. 'ఈ దాడిని బట్టి ఐఎన్ఎల్డీ కార్యకర్తల చీప్ మెంటాలిటీ అర్థమవుతోందని బీజేపీ సీనియర్ నేత జీఎల్ శర్మ అన్నారు.

khattar

ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరంతరం రాష్ట్ర పురోగతి కోసం శ్రమిస్తూ.. అన్ని వర్గాల, కులాల అభ్యున్నతికి తోడ్పడుతున్న సీఎంపై ఇలాంటి దాడి జరగడం విచారకరం అన్నారు.

బీజేపీ యువజన విభాగం కూడా దాడిని తీవ్రంగా ఖండించింది. కాగా, రోడ్ షో అనంతరం దేవీ భవన్‌లాల్‌ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అభిమన్యుతో కలిసి పాల్గొన్నారు ఖట్టర్.

ఇదిలా ఉంటే, సీఎం భద్రతా రీత్యా ఆయన పర్యటనల్లో జర్నలిస్టులు, కెమెరామెన్ లు ఆయనకు కాస్త దూరంగా ఉండాలని గతేడాది సోనిపట్ జిల్లా యంత్రాంగం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

English summary
In a function in Hisar an activist of Indian National Lok Das (INLD) threw ink on Haryana Chief Minister Manohar Lal Khattar during a public event in Hisar on Thursday 17 May 2018. The black ink splashed the chief minister’s face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X