వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Farmers protest: రైతుల వెనుక రాజకీయ ప్రత్యర్థులు, ఖలిస్తానీ దుష్టశక్తులు, సీఎం ఫైర్, మావాళ్లు లేరు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హర్యానా: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఓ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు చేస్తున్న పోరాటం వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని, ముఖ్యంగా ఖలిస్తానీ ఆందోళనకారుల మద్దతు ఇస్తున్నారని ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. మా రాష్ట్రం నుంచి ఇంతవరకు రైతులు ఎవ్వరూ ఢిల్లీ వెళ్లలేదని ఆ సీఎం క్లారిటీ ఇచ్చారు.

Maharashtra: హమ్మయ్యా.... ఏడాది పూర్తి చేసుకున్న సీఎం, అన్నీ సినిమా కష్టాలే, వర్క్ ఫ్రమ్ హోమ్ !Maharashtra: హమ్మయ్యా.... ఏడాది పూర్తి చేసుకున్న సీఎం, అన్నీ సినిమా కష్టాలే, వర్క్ ఫ్రమ్ హోమ్ !

రైతుల ఢిల్లీ చలో మార్చ్

రైతుల ఢిల్లీ చలో మార్చ్

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రైతులు పెద్ద సంఖ్యలో దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి రాజధాని శివార్లలోని నిరంకరి మైదానం చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే.

మైదానంలో వంటావార్పు

మైదానంలో వంటావార్పు

ఢిల్లీ చేరుకుంటున్న రైతులు దేశ రాజధాని శివార్లలోని బురారీలో ఉన్న నిరంకరి మైదానంలోకి వెళ్లడానికి స్థానిక పోలీసులు అనుమతి ఇచ్చారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా నిరసన ఢిల్లీలోనే కొనసాగుతుంది, వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకునే వరకు సుదీర్ఘకాలం మేము ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటామని రైతులు తేల్చి చెప్పారు.

సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులను హర్యానాలోని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే మా రాష్ట్రం నుంచి రైతులు ఎవ్వరూ ఢిల్లీ వెళ్లి అక్కడ నిరసనలు వ్యక్తం చెయ్యడం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతుల వెనుక కొన్ని రాజకీయ దుష్టశక్తులు ఉన్నాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఖలిస్తానీ శక్తులు

ఖలిస్తానీ శక్తులు

ఢిల్లీలో పోరాటం చేస్తున్న వారిని ఖలిస్తానీ ఆందోళనకారులు రెచ్చగొడుతున్నారని మాకు అనేక అనుమానాలు ఉన్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను సమర్థిస్తున్నారని, అయితే కొందరు రాజకీయ స్వార్థం కోసం కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ఆరోపించారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి రైతులు పాదయాత్రగా ఢిల్లీ బయలుదేరారు.

English summary
Farmers Protest: Haryana Chief Minister Manohar Lal Khattar has claimed that the farmers protest has been backed by political parties. He also alleged there is a Khalistani connection in the farmers protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X