వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్‌ ఎక్కిన హర్యానా సీఎం.. ఎందుకంటే..! (VIDEO)

|
Google Oneindia TeluguNews

Recommended Video

సైకిల్‌ ఎక్కిన హర్యానా సీఎం.. ఎందుకంటే..! (VIDEO)

కర్నల్ : మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మరోవైపు 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఆ క్రమంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ కట్టారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్‌‌లో అపర చాణక్యుడు..!ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్‌‌లో అపర చాణక్యుడు..!

అయితే హర్యానా ఎన్నికల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నల్ లోని పోలింగ్ స్టేషన్‌కు సైకిల్‌పై రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో పరిస్థితి కాస్తా అదుపు తప్పినట్లైంది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపించింది. ఎలాగోలా వారిని సముదాయిస్తూ ముందుకు నడిచిన ఖట్టర్ చివరకు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విజయం మనదే అన్నట్లుగా చెప్పుకొచ్చారు.

హర్యానా ఎన్నికల సందర్భంగా సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ టికెట్‌తో ఎన్నికల బరిలో నిలిచిన టిక్‌టాక్ స్టార్ సొనాలి ఫోగట్ ఆడంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటు వేశారు. హర్యానా పీసీసీ ప్రెసిడెంట్ కుమారి సెల్జా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Haryana CM Manohar Lal Khattar rides cycle to polling station

ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో చర్కిదాద్రి సెగ్మెంట్‌లోని బలాలి గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలా ఫ్యామిలీ మెంబర్స్‌తో సహా ట్రాక్టర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

English summary
Haryana Chief Minister Manohar Lal Khattar on Monday first travelled by Janshatabdi Express from Chandigarh to his hometown Karnal in Haryana and then rode a bicycle to cast his vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X